Hyderabad News: దుర్గం చెరువు తీగల వంతెన వద్ద ఆత్మహత్య చేసుకునేందుక యత్నించిన ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడింది. హైడ్రా సిబ్బంది గుర్తించకుంటే క్షణాల్లో యువకుడి ప్రాణాలు పోయేవి. యువకుడి ప్రాణాలు దక్కడంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
శుక్రవారం సాయంత్రం హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది దుర్గం చెరువు తీగల వంతెనపై వర్షపు నీరు నిలవకుండా.. కిందకు వెళ్లే రంద్రాలను శుభ్రం చేస్తున్నారు. అదే సమయంలో ఓ యువకుడు తీగల వంతెన నుంచి దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఇంతలో డీఆర్ ఎఫ్ సిబ్బందిలో ఒకరు ఆ యువకుడి చూశారు. మొత్తం సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఒక వైపు ఉన్నవారు వద్దు.. వద్దు అని వారిస్తుంటే.. మరో వైపు నుంచి మెరుపు వేగంతో వచ్చి యువకుడిని చాకచక్యంగా డీఆర్ఎఫ్‌కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఒడిసి పట్టి బయటకు లాగాడు. దీంతో ప్రమాదం తప్పింది. అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. పేరు రామి రెడ్డి (25). అతనికి పెళ్లి అయింది. ఒక పాప కూడా ఉందని పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసై.. తాగిన మత్తులో ఇంట్లో గొడవపడి వచ్చి ఆత్మహత్యకు యత్నించినట్టు చెప్పారు. అలిగి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతే.. అతని సోదరికి రామిరెడ్డిని పోలీసులు అప్పగించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Grasberg Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని.. అక్కడకు వెళ్తే మొత్తం గోల్డే.. ఎక్కడో తెలుసా?
ALSO READ: Iconic Cable Bridge: హైదరాబాద్‌లో మరో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్.. రెండు కళ్లు సరిపోవు..