E-Paper
Advertisement

Santosh Sobhan: హీరో సంతోష్ శోభన్ చివరిగా ఏడ్చింది అప్పుడే.. అసలు ఏం జరిగిందంటే?

Santosh Sobhan: హీరో సంతోష్ శోభన్ చివరిగా ఏడ్చింది అప్పుడే.. అసలు ఏం జరిగిందంటే?
Advertisement

Santosh Sobhan: సంతోష్ శోభన్ తన కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, అతని వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ముఖ్యంగా తండ్రి మరణం అతడిని మానసికంగా ఎంతో మార్చివేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న ఎమోషనల్ విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సంతోష్ శోభన్ తండ్రి, ప్రముఖ దర్శకుడు శోభన్ (వర్షం చిత్ర దర్శకుడు), సంతోష్ చిన్న వయసులో ఉన్నప్పుడే కన్నుమూశారు. ఆ సంఘటన తన జీవితాన్ని కుదిపేసిందని సంతోష్ పేర్కొన్నారు. “మా నాన్న మరణానికి మించిన విషాదం నా జీవితంలో ఇంకోటి ఉండదు, రాదు కూడా” అని ఆయన చాలా బలంగా చెప్పారు. ఆ చిన్న వయసులో అంతటి పెద్ద బాధను అనుభవించిన తర్వాత, జీవితంలో ఎదురయ్యే మిగిలిన సమస్యలన్నీ చాలా చిన్నవిగా అనిపించడం మొదలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read also-Brahmamudi Serial Today February 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మినిస్టర్ ధర్మేంద్రను ప్రశ్నించిన అప్పు 

ఏడవడమే మానేసిన క్షణం

Advertisement

సాధారణంగా మనుషులు కష్టం వస్తే ఏడుస్తారు, కానీ సంతోష్ విషయంలో అది రివర్స్ అయ్యింది. తండ్రి చనిపోయినప్పుడు అనుభవించిన ఆ తీవ్రమైన బాధాకరమైన క్షణాల తర్వాత తన కళ్ళలో నీళ్లు రావడం ఆగిపోయిందని ఆయన వెల్లడించారు. ఆ స్థాయి బాధను అప్పుడే చూసేయడం వల్ల, ఆ తర్వాత జీవితంలో ఎదురైన ఓటములు, కష్టాలు లేదా కెరీర్ పరమైన ఇబ్బందులు ఏవీ తనను అంతగా కృంగదీయలేకపోయాయని, అందుకే తాను ఆ తర్వాత ఏడవడమే మానేశానని ఆయన చెప్పుకొచ్చారు.

Read also-Illu Illalu Pillalu Today Episode: శ్రీవళ్లి కి దిమ్మతిరిగే షాక్.. సాగర్ కు మైండ్ బ్లాక్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

తల్లి త్యాగం

Advertisement

నాన్న లేని లోటును భర్తీ చేస్తూ, తన తల్లి తనను, తన తమ్ముడిని ఎంత కష్టపడి పెంచిందో గుర్తు చేసుకుంటూ సంతోష్ ఎమోషనల్ అయ్యారు. ఒక ఒంటరి మహిళగా ఆమె పడిన సంఘర్షణ, తనను ఈ స్థాయికి తీసుకురావడానికి ఆమె చేసిన త్యాగాలే ఈరోజు తనను ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చాయని ఆయన పేర్కొన్నారు. 2023లో తన సినిమాలు వరుసగా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో కొంత మానసిక ఒత్తిడికి లోనైనట్లు సంతోష్ అంగీకరించారు. ఆ సమయంలో అసలు సినిమాలు చూడటమే మానేశానని, మెదడు కేవలం ‘సక్సెస్-ఫెయిల్యూర్’ అనే ఫలితాల చుట్టూ తిరగడం వల్ల తనలోని సహజమైన నటుడు ఇబ్బంది పడ్డాడని చెప్పారు. అయితే, ఆ దశ నుంచి కోలుకుని, మళ్ళీ కొత్త ఉత్సాహంతో సినిమాలపై దృష్టి పెట్టానని ఆయన వివరించారు.

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×