Lokesh Kanagaraj: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) త్వరలోనే కూలీ సినిమా (Coolie Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా డైరెక్టర్ లోకేష్ తో పాటు ఇతర చిత్ర బృందం కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ ఇతర సినిమాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్…
లోకేష్ కనకరాజ్ తన సినిమాలన్నింటినీ కూడా లింక్ చేస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(Lokesh Cinimatic Universe) ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎల్ సియులో కోలీవుడ్ హీరో కార్తీ (Karthi)నటించిన ఖైతీ సినిమా(kaithi) కూడా భాగమైంది. ఇదివరకే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది . ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా రాబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటన తెలియజేశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ లోకేష్ కు కూలి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఖైతీ 2(kaithi 2) గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
35 పేజీల స్టోరీ సిద్ధం…
ఈ సందర్భంగా లోకేష్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ కూలీ సినిమా విడుదల పూర్తి అయిన వెంటనే ఖైతీ2 సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలియజేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయని, సుమారు 35 పేజీల వరకు స్టోరీ కూడా సిద్ధం చేసి పెట్టానని లోకేష్ తెలియజేశారు. స్టోరీ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని ఈయన వెల్లడించారు. ఇలా కార్తీ ఖైతీ2 సినిమా గురించి లోకేష్ ఈ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో కూడా కార్తీక్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాలో నటి అనుష్క శెట్టి కూడా భాగం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
మొదలు కాబోతున్న బాక్సాఫీస్ వార్…
ఇక కూలి సినిమా విషయానికి వస్తే రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలు అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్ వంటి సెలబ్రిటీలు భాగమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేసింది. మరి ఆగస్టు 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఇదే రోజు ఎన్టీఆర్హృ, తిక్ రోషన్ నటించిన వార్ 2 కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో రెండు సినిమాలు మధ్య గట్టి పోటీ ఏర్పడిందని చెప్పాలి.
Also Read: Udaya Bhanu: ఇండస్ట్రీలో యాంకర్లను నిజంగానే తొక్కేస్తున్నారా… ఉదయభాను రియాక్షన్ ఇదే?