Sekhar Kammula: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula)తాజాగా కుబేర సినిమా(Kuberaa Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాతిక సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న ఈయన చేసినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయన చేసిన సినిమాలు మాత్రం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ ప్రేక్షకుల మనసును తాకుతాయని చెప్పాలి. ఇప్పటివరకు శేఖర్ సినిమాలను విభిన్నమైన జానర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Danush) రష్మిక మందన్న(Rashmika Mandhanna) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది .
సక్సెస్ సెలబ్రేషన్స్..
ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూని తిరుగుతుందని ఇందులో హీరో ఒక బెగ్గర్ పాత్రలో నటించడం, నాగార్జున క్యామియో రోల్ ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఇలా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని కేక్ కట్ చేసే సంబరాలు చేసుకున్నారు అదే విధంగా రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు కూడా ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు..
హాలీవుడ్ రేంజ్ లో…
తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా రిపోర్టర్ శేఖర్ కమ్ములను ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా ఈ సినిమా రన్ టైం(Run Time) గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ థియేటర్లో సినిమా చూస్తుంటే తాను ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఇక ఇలాంటి ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా చాలా నాచురల్ గానే సినిమా చేయాలనుకున్నాను. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండాలని ఇప్పటివరకు బాంబేని ఎవరు చూపించిన విధంగా మనం చూపించాలని సునీల్ నారంగ్ గారితో కూడా చెప్పినట్లు తెలిపారు ఆయన కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చారని శేఖర్ కమ్ముల వెల్లడించారు.
సినిమా నిడివి తగ్గించాలని మాకు తెలుసు…కానీ
ఇక ఈ సినిమా రన్ టైం 3 గంటల13 నిమిషాలు ఉన్న నేపథ్యంలో చాలామంది రన్ టైం ఎక్కువగా ఉంది అంటూ రివ్యూ ఇచ్చారు అయితే ఈ విషయంపై శేఖర్ స్పందిస్తూ.. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయని, తగ్గించడానికి కాదని తెలిపారు. సినిమాని ఇంత నిడివి ఉండకూడదు, తగ్గించాలి అని దర్శకుడికి చిత్ర బృందానికి తెలియని విషయం కాదు అంటూ కొంత పాటి అసహనం వ్యక్తం చేశారు. కానీ ఒక విషయం గురించి క్లారిటీగా చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పడమే మా లక్ష్యం అందుకే సినిమా నిడివి కూడా కొన్నిసార్లు పెరుగుతుందని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమా విషయంలో మీరు ఇచ్చిన ఈ స్థాయికి రుణపడి ఉంటాను అంటూ పాజిటివ్ రివ్యూస్ పై కూడా ఈయన స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: వాటికి సర్జరీ చేయించుకున్న ప్రియాంక జైన్.. వికటించిందా? శివ్ చివాట్లు!