Priyanka Jain: ప్రియాంక జైన్(Priyanka Jain) పరిచయం అవసరం లేని పేరు. మౌనరాగం అనే బుల్లితెర సీరియల్స్ ద్వారా మూగమ్మాయి పాత్రలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియాంక తన మొదటి సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సీరియల్ తర్వాత స్టార్ మాలో జానకి కలగనలేదు(Janaki Kalaganaledu) అనే సీరియల్ తో మరింత ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు రావడంతో ప్రియాంక తదుపరి బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ తర్వాత ప్రియాంక ఎలాంటి సీరియల్స్ చేయకపోయినా బుల్లితెర కార్యక్రమాలతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
మౌనరాగం సీరియల్…
ఇకపోతే ప్రియాంక మౌనరాగం సీరియల్ నటుడు శివకుమార్(Shiva Kumar) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సీరియల్ సమయం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోయినా రిలేషన్ లో ఉన్నారు.దీంతో వీరి రిలేషన్ గురించి తరచూ ఎన్నో రకాల విమర్శలు వస్తున్నప్పటికీ పెళ్లి గురించి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే తాజాగా ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా శివను ప్రాంక్ చేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.
లిప్ సర్జరీ.. మండిపడిన శివ కుమార్..
ఇందులో భాగంగా లిప్స్ సర్జరీ (Lips Surgery) చేయించుకుంటున్నట్లు తనని ప్రాంక్ చేస్తానని తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. అయితే లిప్ ప్లంబర్ అనే ఒక క్రీమ్ రాయటం వల్ల పెదాలు మొత్తం మంట పుట్టి పెదాల చుట్టూ స్కిన్ మొత్తం ఎర్రగా మారిపోయి, పెదవులు కాస్త ఉబ్బిపోతాయి. ఆ క్రీమ్ ఈమె తన పెదాలకు రాసుకొని శివకుమార్ రావడంతో తాను పెదాలకు సర్జరీ చేయించుకున్నానని చెప్పడంతో ఒక్కసారిగా శివకుమార్ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను అడగకుండా నిన్ను ఎవరు సర్జరీ చేయించుకోమన్నారు అంటూ ప్రశ్నించారు.
ప్రాంక్ చేసిన ప్రియాంక…
నీ లిప్స్ అంటే నాకు చాలా ఇష్టం అనే సంగతి నీకు తెలుసు, మరి ఎందుకు సర్జరీ చేయించుకున్నావ్? అసలు ఎక్కడ చేయించుకున్నావ్? అంటూ ఆమెపై సీరియస్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా శివకుమార్ లిప్స్ సర్జరీ విషయంలో ప్రియాంకకు బాగా చివాట్లు వేస్తూ సీరియస్ కావడంతో వెంటనే ప్రియాంక అసలు విషయం బయటపెట్టారు. తాను లిప్స్ సర్జరీ చేయించుకోలేదని, కేవలం నిన్ను ప్రాంక్ చేయడానికి ఇలా చేశానని తెలిపారు. లిప్ ప్లంబర్ అనేది ఒక లిప్ బాంబు లాంటిదేనని అది రాయడం వల్ల ఇలా పెదాలు మొత్తం ఎర్రగా మారిపోతాయి, ఒక రెండు గంటల తర్వాత మామూలు స్థితికి వస్తాయి అని చెప్పడంతో శివకుమార్ ఒక్కసారిగా తన మూతిపై కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రాంక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. నువ్వు ఇలాంటి వీడియో చేస్తున్నావని శివకుమార్ కి ముందే తెలుసు, మీరిద్దరూ కలిసి మమ్మల్ని ఫూల్స్ ను చేస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం మీ లిప్స్ చాలా బాగుంటాయి సర్జరీ చేయించొద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు.
Also Read: ‘నీకు రాజకీయాలు అవసరమా ?’.. దీనికి మొగలిరేకులు హీరో ఆన్సర్ ఇదే