Fatty Liver Symptoms: నేటి తరంలో ముఖ్యంగా పురుషుల్లో ఫ్యాటీ లివర్ చాలా వేగంగా పెరుగుతున్న సమస్యగా మారింది. ఫ్యాటీ లివర్ అంటే.. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం. దీని కారణంగా.. కాలేయ పనితీరు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఫ్యాటీ లివర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయకపోతే.. అది లివర్ సిర్రోసిస్ రూపంలోకి మారుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాంటే.. రాత్రిపూట కనిపించే కొన్ని లక్షణాల ద్వారా ఫ్యాటీ లివర్‌ను గుర్తించవచ్చు . రాత్రిపూట కనిపించే ఫ్యాటీ లివర్ యొక్క కొన్ని సంకేతాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రిపూట అధిక చెమట:
ఫ్యాటీ లివర్ రాత్రిపూట అధిక చెమటకు కారణమవుతుంది. కాలేయం యొక్క డీహైడ్రేషన్ ప్రక్రియలో సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సమస్యలు వస్తాయి. ఇది అధిక చెమటకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.
అలసటగా, బలహీనత:
ఫ్యాటీ లివర్ శరీరంలో శక్తి లోపానికి కారణమవుతుంది. దీని వల్ల రాత్రిపూట లేదా పగటిపూట నిద్రపోతున్నప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేయలేకపోవడం వల్ల.. శరీరానికి తగినంత పోషకాహారం లభించదు. దీని కారణంగా వ్యక్తికి ఎల్లప్పుడూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది.
తరచుగా నిద్రకు ఆటంకం:
ఫ్యాటీ లివర్ రోగులు తరచుగా నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటారు. కాలేయంలో మంట లేదా చికాకు కారణంగా.. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. దీంతో పాటు.. కడుపు సంబంధిత సమస్యలు కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
ఎపిగాస్ట్రిక్ నొప్పి:
ఫ్యాటీ లివర్ విషయంలో.. కడుపులో కుడివైపు పైభాగంలో నొప్పి, భారంగా లేదా ఒత్తిడిగా అనిపిస్తుంది. ఈ సమస్య రాత్రిపూట ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు కడుపుపై ఒత్తిడి ఉంటుంది. గ్యాస్ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడే వారు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
కాళ్ళలో వాపు:
కాలేయం దెబ్బతిన్నప్పుడు, శరీరంలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల పాదాలు, చీలమండలలో వాపు వంటివి వస్తాయి. ఈ వాపు రాత్రి సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే పగటిపూట పనుల తర్వాత, శరీరంలో రక్త ప్రసరణ ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది.
చర్మంపై దురద:
ఫ్యాటీ లివర్ వల్ల కాలేయం నుండి పైత్యరసం బయటకు పోవడంలో సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల చర్మంపై దురద వంటివి వస్తుంటాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల చర్మంలో చికాకు కలుగుతుంది. కాబట్టి రాత్రిపూట ఈ దురద పెరుగుతుంది.
Also Read: అన్ని వ్యాధులకు ఒకటే పరిష్కారం, వీటితో బోలెడు బెనిఫిట్స్
జాగ్రత్తలు:
మద్యం నుండి దూరంగా ఉండండి- మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి దానిని నివారించండి.
క్రమం తప్పకుండా వ్యాయామం – ప్రతిరోజూ 30 నిమిషాల నడక లేదా యోగా చేయండి.
బరువును నియంత్రించుకోండి- ఊబకాయం ఫ్యాటీ లివర్ సమస్యకు ప్రధాన కారణం. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోండి.
వైద్యుడిని సంప్రదించండి – లక్షణాలు తీవ్రంగా ఉంటే.. వైద్యుడిని సంప్రదించి కాలేయ పనితీరు పరీక్ష చేయించుకోండి.
Also Read: పసన పండు తింటే.. బోలెడు ప్రయోజనాలు