Suniel Narang : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలలో సునీల్ నారంగ్ ఒకరు. కేవలం సినిమాలో నిర్మించడం మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా థియేటర్స్ కలిగి ఉన్న వ్యక్తిగా సునీల్ కు మంచి పేరు ఉంది. థియేటర్స్ బిజినెస్ అనేది వీళ్లు నాన్నగారు కాలం నుంచి నడుపుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటం వలన పలు రకాల ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది హీరోలతో కలిసి ఏషియన్ థియేటర్స్ ను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సైతం ఈయనతో చేతులు కలిపి థియేటర్లను నిర్మించారు. ఇక ప్రస్తుతం ఈయన నిర్మాతగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా వస్తుంది.
నటుడుగా కూడా చేశారు.?
రీసెంట్ టైమ్స్ లో ఇంటర్వ్యూస్ వలన బాగా పాపులర్ అవడంతో ఈయన ఫేస్ కూడా రిజిస్టర్ అయిపోయింది. అయితే రీసెంట్ గా ఒక సినిమా చూస్తున్న తరుణంలో ఈయన నటుడుగా చేసిన ఒక సినిమా తారసపడింది. తేజ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నిజం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. కానీ ఈ సినిమాను కూడా ఇష్టపడిన జనాలు చాలామంది ఉన్నారు. అయితే ఈ సినిమాలో సునీల్ నారంగ్ ఒక కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆ సినిమాలోని ఈయన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా మహేష్ బాబుతో కలిసి థియేటర్స్ నిర్మించడానికి పరిచయం అక్కడ నుంచే మొదలైంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం మొదలయ్యాయి.
నిర్మాతగా మంచి సినిమాలు లైనప్
ఒకవైపు థియేటర్ కి సంబంధించిన బిజినెస్ పక్కన పెడితే, మరోవైపు నిర్మాతగా అద్భుతమైన సినిమాలను నిర్మించే పనిలో పడ్డారు. మంచి మంచి దర్శకులను హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ములతో రెండు సినిమాలు నిర్మించిన నారంగ్, మరోసారి మూడవ సినిమా అని కూడా చేయడానికి సిద్ధమయ్యారు. అలానే 96 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సి ప్రేమ్ కుమార్ కూడా ఈయన నిర్మాణంలో సినిమా చేయనున్నట్లు రీసెంట్ గా ఇచ్చిన ఒక ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన జాక్ సినిమా తీసుకొని చాలా నష్టపోయాను అని పలు ఇంటర్వ్యూస్ లో బహిరంగంగానే చెప్పుకొచ్చారు సునీల్.
Also Read : Sekhar Kammula : ఆయనను తలుచుకుని ఒంటరిగా ఏడుస్తా