BigTV English

Sekhar master: ఇండస్ట్రీలోకి మరో స్టార్ కిడ్.. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ.. పూర్తి వివరాలివే!

Sekhar master: ఇండస్ట్రీలోకి మరో స్టార్ కిడ్.. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ.. పూర్తి వివరాలివే!

Sekhar master: సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలామంది వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇంకొంతమంది తమకు నచ్చిన రంగాలలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన సెలబ్రిటీల వారసులు హీరో, హీరోయిన్ గానే అడుగు పెడుతున్నారా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది డైరెక్షన్ విభాగంలో మరికొంతమంది సినిమాటోగ్రఫీ విభాగంలో ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన విభాగంలో వారు సత్తా చాటుతున్నారు. మరి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. ఏకంగా నేషనల్ అవార్డులు కూడా అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక స్టార్ సెలబ్రిటీ కూతురు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.


బెస్ట్ కొరియోగ్రాఫర్ గా భారీ గుర్తింపు..

ఇప్పటికే తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో , పలు టిక్ టాక్ వీడియోలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ స్టార్ కిడ్.. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అని తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఇక ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు ప్రముఖ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న శేఖర్ మాస్టర్ (Sekhar master) కూతురు సాహితీ శేఖర్ (Sahithi Sekhar). బుల్లితెర ప్రేక్షకుల్లో శేఖర్ మాస్టర్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు చిరంజీవి (Chiranjeevi) ని మొదలుకొని రాంచరణ్ (Ram Charan) వరకు పలువురు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించి, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరు కూడా సొంతం చేసుకున్నారు.


ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్న శేఖర్ మాస్టర్ కూతురు..

ఇక ఈయనకు సాహితీ, విన్నీ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు కూడా మంచి డాన్సర్లే. గతంలో పలు షోలలో సందడి చేశారు. భవిష్యత్తులో గొప్ప డాన్సర్లు అవుతారని అందరూ అభిప్రాయపడ్డారు ..కానీ ఇప్పుడు సాహితీ మాత్రం హీరోయిన్ గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని సమాచారం. ఒక కొత్త డైరెక్టర్ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. తన కూతుర్ని హీరోగా.. ఇండస్ట్రీకి ఈయన సినిమాతోనే పరిచయం చేయాలి అని శేఖర్ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నారట.. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకుంటున్న కుర్ర హీరోల సినిమాలతోనే తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కూడా చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే నిజమైతే త్వరలో శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ శేఖర్ కూడా హీరోయిన్గా వెండితెరపై ఆకట్టుకోబోతోంది అని చెప్పవచ్చు.

టిక్ టాక్ వీడియోలతో భారీ పాపులారిటీ..

ఇక సాహితీ విషయానికి వస్తే.. సాహితీకి సోషల్ మీడియాలో చాలామంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిజానికి ఈమె శేఖర్ మాస్టర్ కూతురుగానే అందరికీ పరిచయమైనా.. తన డాన్స్ తో టిక్ టాక్ వీడియోలతో ఊహించని ఇమేజ్ అందుకుంది. చక్కగా కుందనపు బొమ్మలా ఉండే ఈ అమ్మాయి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సినిమా కథా చర్చలు జరుగుతున్నాయని, అన్ని ఓకే అయితే త్వరలో హీరోయిన్గా శేఖర్ మాస్టర్ కూతురు ఎంట్రీ ఇవ్వనున్నారు అని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:Trisha Krishnan: ఆ పరిస్థితి నాకొద్దు.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిష! 

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×