Trisha Krishnan: ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో ఆడియన్స్ ను అలరిస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ల అవుతున్నా.. రీఎంట్రీలో కూడా హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది త్రిష. కెరియర్ పరంగా బిజీగా మారింది కానీ ఇటు వ్యక్తిగతంగా వివాహం అనే పదానికి మాత్రం ఇంకా దూరంగానే ఉంది అని చెప్పవచ్చు. గతంలో ఒక బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది పెళ్లి కూడా చేసుకుంటారనుకునే లోపే మధ్యలోనే బ్రేకప్ చెప్పుకున్నారు.
ఎఫైర్ రూమర్స్ తో సతమతమవుతున్న త్రిష..
ఇదిలా ఉండగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తెలుగులో ‘వర్షం’ సినిమాలో నటించేటప్పుడు ప్రభాస్ (Prabhas) తో ప్రేమలో పడింది అని, దివంగత సీనియర్ నటులు కృష్ణంరాజు (Krishnam Raju) కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఏమైందో తెలియదు వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శింబు (Simbu) తో ప్రేమాయణం నడిపింది. అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇక ఇప్పుడు విజయ్ దళపతి (Vijay Thalapathi) తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఇక ఇలా ఎఫైర్ రూమర్స్ తో జీవితాన్ని గడిపేస్తోంది. కానీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది త్రిష.
పెళ్లిపై తన అభిప్రాయాన్ని పంచుకున్న త్రిష..
ఇదిలా ఉండగా ఇలా రోజుకొక వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో మొన్నా మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. పెళ్లిపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. గతంలో పెళ్లి పై నమ్మకం లేదని, పెళ్లి అయినా కాకపోయినా.. తనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని త్రిష తెలిపింది. ఆ తర్వాత కొంతకాలానికి సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమే. అంటూ కూడా చెప్పుకొచ్చింది.
అలాంటి పెళ్లి నాకొద్దు – త్రిష
అయితే ఇప్పుడు సడన్గా నాకు ప్రేమతో నిండిన జీవితం కావాలి.. నన్ను చేసుకోబోయే వాడు జీవితాంతం తోడుగా ఉంటాడనే నమ్మకం నాకు కలగాలి. అప్పుడే వివాహం చేసుకుంటాను. అంతేకానీ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం నాకు నచ్చదు. మ్యారేజ్ చేసుకొని చాలామంది అసంతృప్తితోనే జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి నాకొద్దు.. విడాకులు తీసుకునే పెళ్లి అసలే వద్దు క్లారిటీ ఇచ్చింది త్రిష.
త్రిష సినిమాలు..
త్రిష విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi ) హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పుడు దసరాకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక నాలుగు పదుల వయసులో కూడా సినీ పరిశ్రమలో తన క్రేజ్ రోజుకూ పెంచుకుంటూ మరింత బిజీగా మారిపోయింది త్రిష.
ALSO READ:Udaya Bhanu: మాస్ స్టెప్పులతో అదరగొట్టేసిన ఉదయభాను.. దెబ్బకు కెరియర్ గాడిన పడనుందా?