BigTV English

Shahrukh Khan: రోజులో 4 గంటలే నిద్ర.. షాకింగ్ కామెంట్స్ చేసిన షారుఖ్ !

Shahrukh Khan: రోజులో 4 గంటలే నిద్ర.. షాకింగ్ కామెంట్స్ చేసిన షారుఖ్ !

Shahrukh Khan:సినిమాల కోసం సెలబ్రిటీలు ఏ రేంజ్ లో కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సీనియర్ హీరోలు రోజుకి రెండు మూడు షిఫ్ట్ లు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అలాంటి రోజులు మళ్లీ వచ్చాయని చెప్పాలి. నిజానికి కొంతమంది హీరోయిన్లు ఎనిమిది గంటల పని దినాలు అని అడుగుతున్నా.. మరికొంతమంది అర్ధరాత్రి 12 వరకు సినిమా షూటింగ్ చేసి వచ్చి.. రోజులో కొన్ని గంటలు మాత్రమే నిద్రకు కేటాయిస్తున్న విషయం తెలిపిందే. అలాంటి వారిలో ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan) .. తాను రోజులో కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతానని షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.


రోజుకి 4 గంటలే నిద్ర..

అసలు విషయంలోకి వెళ్తే.. షారుక్ ఖాన్ ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫిట్నెస్ అలవాట్లు , తన దినచర్య గురించి మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..” నేను రోజులో నాలుగు గంటలే నిద్రపోతాను. అంటే ప్రతిరోజు అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు పని ముగించుకొని ఇంటికి వస్తాను. ఆ సమయంలోనే వ్యాయామం కూడా చేస్తాను. స్నానం చేసి నేను పడుకునేసరికి తెల్లవారుజామున 5:00 అవుతుంది. మళ్లీ ఉదయం 9 గంటలకు మేల్కొంటాను” అంటూ షారుఖ్ ఖాన్ తెలిపారు. మొత్తానికైతే ఆయన రోజూవారీ దినచర్యలో ఆయన కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే బాడీపై ఎఫెక్ట్ పడుతుందని, ఆరోగ్యం జాగ్రత్త అంటూ అభిమానులు కంగారుపడుతూ సలహాలు ఇస్తున్నారు. ఇకపోతే తనకు తందూరీ చికెన్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చారు షారుఖ్ ఖాన్. మొత్తానికి అయితే షారుఖ్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


షారుఖ్ ఖాన్ కెరియర్..

షారుఖ్ ఖాన్ కెరియర్ విషయానికి వస్తే.. సినీ నటుడిగా, నిర్మాతగా, టీవీ హోస్ట్ గా కూడా వ్యవహరించారు. ఇప్పటివరకు 80కి పైగా సినిమాలలో నటించిన ఈయన.. ఆ సినిమాలతో 14 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆసియాలోనే అత్యంత ప్రముఖులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువగా నివసించే ప్రదేశాలలో కూడా ప్రసిద్ధుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ఫుల్ వ్యక్తులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు షారుఖ్ ఖాన్.. ఇక 33 ఏళ్ల సినీ కెరీర్ లో ఇటీవల నేషనల్ అవార్డు అందుకొని తన కోరికను నెరవేర్చుకున్నారు. ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డు రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.. ఇకపోతే 2005లో పద్మశ్రీ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.

షారుఖ్ ఖాన్ సినిమాలు..

షారుక్ ఖాన్ సినిమాలు.. ప్రస్తుతం ‘కింగ్’ సినిమాలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాపై అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాగే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా ఈయన భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Related News

Nagarjuna: ఢిల్లీ హైకోర్టులో నాగార్జునకి ఊరట.. వారిపై వేటు తప్పదా?

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో ట్విస్ట్.. మరో వ్యక్తి అరెస్ట్!

IBomma Counter: బరాబర్ పైరసీ చేస్తాం… పోలీసులకు ఐ బొమ్మ స్ట్రాంగ్ కౌంటర్!

Deepika Padukone: ఇట్స్ రివేంజ్ టైమ్.. సందీప్ కి దీపిక స్ట్రాంగ్ కౌంటర్!

Kantara 2 Premiers: ఏపీలో కాంతార ప్రీమియర్ షోలు రద్దు.. నిరాశలో ఫ్యాన్స్.. కారణం?

Film industry: షాకింగ్.. స్టార్ జంటకు విడాకులు మంజూరు!

Dimple Hayathi:హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేస్… అసలేం జరిగిందంటే?

Drugs Case: డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్.. ఏకంగా 35 కోట్ల విలువ.. ఎవరంటే?

Big Stories

×