Brahmamudi serial today Episode: వ్రతానికి కావ్య రెడీ అయి వస్తుంది. రాజ్ అదే పనిగా చూస్తుంటాడు. కావ్య కిందకు రాగానే మిమ్మల్ని చేస్తూ ఉంటే.. దేవకన్యలా ఉన్నారు అంటాడు. దీంతో స్వప్న అబ్బో ఏకంగా దేవకన్యనేనా..? ఏంటి రామ్ పబ్లిక్‌గా మా ఎదురుగానే కావ్యకు సైట్ కొడుతున్నావు అని అడుగుతుంది. అదేం లేదు.. మీరెందుకు అలా అనుకుంటారు.. అవును పండగ అన్నాక చాలా పనులు ఉంటాయి. మీకు ఏం వర్క్ లేదా..? అంటాడు రాజ్. దీంతో అందరూ ఒక్కోక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కావ్య కూడా వెళ్లిపోతుంటే.. కళావతి గారు ఈ చీరలో మీరు అందంగా ఉన్నారు అంటాడు. అది ఇందాకే చెప్పారు కదా అంటుంది కావ్య. అది పబ్లిక్ గా చెప్పానండి.. ఇప్పుడు పర్సనల్ గా కాంప్లిమెంట్ ఇస్తున్నాను అంటాడు.
అసలు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు.. నన్ను విసిగించడానికి వచ్చారా..? అంటుంది కావ్య.. హలో మేడం నేను మీ కోసం రాలేదు.. వీడికి తీసుకురావడానికి వచ్చాను చెప్పరా..? అని రాజ్ చెప్పగానే.. స్వరాజ్ మాట్లాడుతూ గుడిలో జరిగింది నా ఫ్రెండ్‌కు చెబుతా అంటాడు. దీంతో కావ్య భయంగా ఓరేయ్ మీరిద్దరూ ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్లిపోతుంది. పై నుంచి అంతా చూస్తున్న రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటారు. అబ్బా ఏం ప్లాన్ చేసిందిరా మా అమ్మ ఈ బడ్డొడిని అడ్డం పెట్టుకుని ఆ రాజ్‌ను ఇక్కడకు రప్పించింది. ఆ కావ్యను వ్రతంలో కూర్చోబెట్టి రాజ్ చేత అక్షింతలు వేయించి పూజ పూర్తి చేయాలని చూస్తుంది అని చెప్పగానే అబ్బా అదంతా మనకెందుకు అమ్మా ఆ కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం రాజ్‌కు తెలిస్తే చాలు అంటాడు రాహుల్. అవును అందరి ముందు ఆ కావ్యనే తాను ప్రెగ్నెంట్ అని చెబితే ఆ రాజ్ గాడు గుండె పగిలి చచ్చిపోతాడు. అనుకుంటూ వెళ్లిపోతుంది.
అప్పు వెళ్లి కావ్యను తన టాబ్లెట్స్ అయిపోయాయని నీ దగ్గర ఉంటే ఇవ్వమని అడుగుతుంది. దీంతో కావ్య గట్టిగా అడగొద్దని అందరికీ తెలుస్తుందని చెప్పగానే.. సరేలే అంటూ టాబ్లెట్ తీసుకుని వెళ్లిపోతుంది అప్పు. అప్పుడే అక్కడికి వచ్చిన కనకం, కావ్యను చూసి బాధపడుతుంటే.. రుద్రాణి వింటుంది. అటుగా వెళ్తున్న ధాన్యలక్ష్మీని పిలిచి నేను చెబితే వినడం లేదు నీ చెవులతో నువ్వే విను అంటూ కావ్య, కనకం మాట్లాడుకోవడాన్ని చూపిస్తుంది. అప్పుడే కావ్య అప్పుకు ఉన్న అదృష్టం నాకు లేదు కద అమ్మా అంటూ బాధపడుతుంది. చూశావా అప్పుకు ఉన్న అదృష్టం తనకు లేదని బాధపడుతుంది ఇప్పటికైనా అర్థం అయిందా కావ్య ఎలాంటిదో అంటూ చెప్పి రుద్రాణి వెళ్లిపోతుంది. ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడిపోతుంది.
మరోవైపు అప్పు కొత్త బట్టలు తీసుకొచ్చి కళ్యాణ్‌కు ఇస్తూ ఇవి బావకు స్వరాజ్‌కు ఇవ్వు వాళ్లను త్వరగా రెడీ అవ్వమను అని చెప్తుంది. కళ్యాణ్ బట్టలు తీసుకుని రాజ్ దగ్గరకు వెళ్తాడు. రేయ్ బుడ్డోడా ఆటలు ఆడింది చాలు.. అన్నయ్య ఇదిగో మీరిద్దరూ వెళ్లి ఈ కొత్త బట్టలు కట్టుకుని రెడీ అవ్వండి అని చెప్తాడు. ఇప్పుడు నేనేందుకు కట్టుకోవాలి కళ్యాణ్ కొత్త బట్టలు.. అని అడగ్గానే అదేంటి ఇవాళ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఉంది కదా అన్నయ్యా అంటాడు కళ్యాణ్. ఆ వ్రతంలో మేము కూర్చోవడం లేదు కదా అని రాజ్ అడగ్గానే.. మనమెందుకు కూర్చోకూడదు మామయ్య అని స్వరాజ్ అడుగుతాడు. దీంతో ఎందుకంటే మనం ఇంకా బ్యాచిలర్ కాబట్టి అని రాజ్ చెప్పగానే అంటే ఈ అబ్బాయి అబ్బాయి కాదా అంటూ కళ్యణ్‌ను చూపించి అడుగుతాడు.
దీంతో కళ్యాణ్ రేయ్ బ్యాచిలర్ అబ్బాయి అని కాదురా..? ఇంకా పెళ్లి కాలేదు అని అర్థం అంటూ చెప్పి బట్టలు ఇచ్చి వెళ్లిపోతాడు కళ్యాణ్. మరోవైపు రుద్రాణి కోపంగా చూస్తూ.. కావ్య, అప్పుకు ఇచ్చిన టాబ్లెట్ మార్చమని రాహుల్‌కు చెప్తుంది. రాహుల్ సరే అంటాడు. వేరే టాబ్లెట్ తీసుకుని అప్పు రూంలో పెట్టి వెళ్లిపోతాడు. అప్పుడే ధాన్యలక్ష్మీ రూంలోకి వెళ్లి టాబ్లెట్ తీసుకుని వెళ్తుంది. టాబ్లెట్ మార్చి వచ్చిన రాహుల్‌ను రుద్రాణి మెచ్చుకుంటుంది. ధాన్యలక్ష్మీ తీసుకెళ్లిన టాబ్లెట్ అప్పుకు ఇస్తుంది. అప్పు టాబ్లెట్ వేసుకుంటుంది. తర్వాత రాజ్ రెడీ అయి రాగానే కావ్య అలాగే చూస్తుంటుంది. రాజ్ కిందకు వచ్చి ఎలా ఉన్నానని అడుగుతాడు. కావ్య ఏదోలా ఉన్నారులే అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం