Irfan Pathan : టీమిండియా మాజీ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni) పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వీరెంద్ర సెహ్వాగ్ ధోనీ తనను జట్టు నుంచి తప్పించాడని ఆరోపించారు. సెహ్వాగ్ (Sehwag) చేసిన వ్యాఖ్యలు 24 కూడా గడవకముందే మరో భారత మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం మాజీ కెప్టెన్ ధోనీ పై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే తన కెరీర్ నాశనమైందని ఇర్పాన్ పఠాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తాను మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ జట్టు నుంచి ధోనీ తప్పించాడని ఆరోపించాడు. జట్టులో ప్రధాన పేసర్ గా.. పేస్ ఆల్ రౌండర్ గా అద్భుతంగా రాణించిన ఇర్ఫాన్.. ఉన్నట్టుండి 2009లో టీమిండియా కి దూరమయ్యాడు.
Also Read : Akash Deep : కొత్త కారు కొన్న ఆకాష్ దీప్ కు నోటీసులు.. కారణం ఇదే..!
క్లిష్ట పరిస్థితుల్లో విజయతీరాల్లోకి..
” శ్రీలంక తో జరిగిన సిరీస్ లో నా అన్న యూసఫ్ పఠాన్ తో కలిసి నేను అద్భుతమైన విజయాన్ని అందించాను. కేవలం 27 బంతుల్లోనే 60 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టును విజయతీరాల్లోకి చేర్చాం. మ్యాచ్ గెలిచినప్పటి ప్రదర్శన చూసి ఏ కెప్టెన్ అయినా దాదాపు ఏడాది వరకు పక్కకు పెట్టరు. కానీ తరువాత సిరీస్ న్యూజిలాండ్ పర్యటనలో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు ధోనీ. ఈ విషయం గురించి అప్పటి కోచ్ గ్యారీ కిర్ స్టేన్ అడిగాను. నన్ను పక్కన పెట్టడానికి కారణం ఏంటని ప్రశ్నించాను. కిర్ స్టన్ నాకు రెండు కారణాలు చెప్పాడు. కొన్ని విషయాలు నా చేతుల్లో లేవని చెప్పాడు. తుది జట్టు ఎంపిక తుది నిర్ణయం కెప్టెన్ దే” అని వెల్లడించాడు. అంటే అప్పుడు టీమిండియా కెప్టెన్ గా ఉన్నది ధోనీ నే చెప్పుకొచ్చాడు ఇర్పాన్ పఠాన్.
ధోనీ తుది నిర్ణయం..
రెండో కారణంగా ఏడో స్థానంలో జట్టుకు ఒక ఆల్ రౌడర్ కావాలని జట్టు భావిస్తుందని తెలిపాడు. యూసఫ్ పఠాన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్. జట్టులో ఒక్కరికే స్థానం ఉందని.. తాను బౌలింగ్ ఆల్ రౌండర్ అని తెలిపాడు పఠాన్. తుది జట్టు ఎంపికలో కెప్టెన్ దే తుది నిర్ణయం సరైనదా..? కాదా..? అనేది చెప్పాలనుకోవడం లేదని వెల్లడించాడు. మరోవైపు భారత్ తరపున చివరి మ్యాచ్ ను ఇర్ఫాన్ పఠాన్ 2012 అక్టోబర్ లో ఆడాడు. ఆ తరువాత తిరిగి మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు పఠాన్. ఇక 2020లో రిటైర్మెంట్ ప్రకటించేశాడు ఇర్ఫాన్ పఠాన్. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ పై వీరేంద్ర సెహ్వాగ్, ఇర్పాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ధోనీ అందరినీ కలుపుకొని పోతాడుకుంటే.. ఇలా కూడా చేశాడా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ ధోనీ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం గా మారడం విశేషం.