Aadarsha Kutumbam:విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయన్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సినిమా రిలీజ్ ప్రెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
థమన్ మాట్లాడుతూ . ఒక సినిమా సక్సెస్ అవ్వాలన్నా, ప్రేక్షకుల మనసు గెలవాలన్నా ఒక్కరి కష్టంతో సరిపోదని, అందరూ కలిసి పని చేస్తేనే అవుతుందని చెప్పారు. అలా ఈ సినిమా విషయంలో టీమ్ అంతా ఒక సొంత కుటుంబంలా కలిసి పనిచేసిందని, ఆ కృషితోనే అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ స్థాయికి తీసుకెళ్లగలిగామని తెలిపారు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించిన మాట్లాడుతూ త్రివిక్రమ్ మాటల్లో ఉండే పవర్, ఆయన థాట్ ప్రాసెస్ చాలా స్పెషల్ అని ఆకాశానికి ఎత్తేశారు .కేవలం తన డైలాగ్స్ తోనే ఒక మామూలు సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగల టాలెంట్ ఆయన సొంతమని, సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తూనే ఎమోషన్స్ కి గురి చేయడం త్రివిక్రమ్‌కే చెల్లిందని, అందుకే ఆయనను తామంతా ఒక జీనియస్‌గా భావిస్తామని చెప్పారు.కాని మాటలు రాసే వారే పాటలు పడుతుంటే చాలా బాధగా ఉందని వాపోయారు.సాధారణంగా ఆయన సినిమాల్లో వినోదంతో పాటు జీవిత సత్యాలు కూడా దాగి ఉంటాయని, ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ కాబోతోందని థమన్ కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు.
ఇక సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ గురించి మాట్లాడుతూ రిలీజ్ డేట్ అనేది మన చేతుల్లో ఉండదని, అయితే సినిమాను ఆడియన్స్ కి సరిగ్గా అందించేందుకు యూనిట్ అంతా బాగా కష్టపడిందని తెలిపారు. ప్రమోషన్స్ ,సాంగ్ రిలీజ్ అనేవి అనుకున్నంతగా సాగకపోయినా అనుకున్న టార్గెట్ రీచ్ కావడం హ్యాపీగా ఉందని తెలిపారు.
ముఖ్యంగా సినిమా రిలీజ్ కి ముందు గత పది రోజులు పాటు అసలు నిద్ర కూడా లేకుండా రికార్డింగ్ స్టూడియోలోనే గడిపామని, రీల్స్ ఆర్ఆర్, మిక్సింగ్ పనుల్లో మునిగిపోయామని చెప్పారు. స్క్రీన్ పైకి రాని ఆ చివరి నిమిషం కష్టం చాలా పెద్దదని, ఆ సమయంలో లభించిన అనుభవం తన జీవితంలోనే బెస్ట్ మెమరీస్ అని చెప్పుకొచ్చారు.
వెంకటేష్‌తో తనకున్న బాండింగ్ గురించి చెబుతూ వెంకీ సర్ లాంటి పాజిటివ్ మనిషితో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఒక మంచి అనుభవమని, ఆయన ఇచ్చే ప్రోత్సాహం పక్కన ఉన్నవారిలో మరింత ఎనర్జీని నింపుతుందని ఆకాశానికి ఎత్తేశాడు. తెరముందు కనిపించే నటీనటులతో పాటు తెరవెనుక కష్టపడే ప్రతీ ఒక్కరి శ్రమ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.చూడాలి మరి ఈసారి త్రివిక్రమ్ తన పెన్ పవర్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో !
ALSO READ :ఫ్యామిలీ కథలే ఎందుకు తీస్తారు? రిపోర్టర్‌కు త్రివిక్రమ్ అదిరిపోయే కౌంటర్!