E-Paper
Advertisement

గేమ్ ఛేంజర్ దెబ్బకు మారిన శంకర్.. 500 కోట్ల ‘వేల్పరి’ ఆగిపోవడానికి అసలు కారణం ఇదే!

గేమ్ ఛేంజర్ దెబ్బకు మారిన శంకర్.. 500 కోట్ల ‘వేల్పరి’ ఆగిపోవడానికి అసలు కారణం ఇదే!
Advertisement

Shankar Comeback: సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీని ‘శంకర్ కి ముందు.. శంకర్ కి తర్వాత’ అని డివైడ్ చేయొచ్చు అంటే ఆశ్చర్యం లేదు. జెంటిల్ మెన్ సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం, భారతీయ వెండితెరపై విజువల్ గ్రాండియర్స్ కు సరికొత్త కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. కమర్షియల్ సినిమాల్లో సామాజిక అంశాలను జోడిస్తూ, భారీ బడ్జెట్‌తో అద్భుతాలు సృష్టించడం శంకర్ కి మాత్రమే సాధ్యమైంది. జెంటిల్ మెన్ నుంచి రాబోయే ‘గేమ్ ఛేంజర్’ దాకా ఆయన కెరీర్‌లో మీడియం బడ్జెట్ అనే పదానికే చోటు లేదు.

అయితే, ఒకప్పుడు శంకర్ పేరు చెబితే థియేటర్ల వద్ద కనిపించిన బ్రాండ్ వాల్యూ, క్రేజ్ ఇప్పుడు కొంత తగ్గాయన్నది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా గత ఏడాది (2025) విడుదలైన ‘భారతీయుడు 2’ (ఇండియన్ 2) బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. ఈ చిత్రం చేసిన డ్యామేజ్ శంకర్ కెరీర్‌పై గట్టి ప్రభావమే చూపించింది.

Advertisement

500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌

ఈ ఎదురుదెబ్బల వల్ల శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డ్రీం ప్రాజెక్ట్ ‘వేల్పరి’ అడుగులు ముందుకు పడటం లేదు. తమిళ నవల ఆధారంగా మూడు భాగాలుగా, దాదాపు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ పీరియాడిక్ విజువల్ వండర్‌ను ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంతటి భారీ మొత్తాన్ని పెట్టేందుకు ప్రొడ్యూసర్స్ దొరకడం గగనమైపోయింది. దీనికి తోడు, ‘ఇండియన్ 3’కాంట్రవర్సీ ఉండనే ఉంది.

Advertisement

Also read :అమ్మపై ప్రేమే ఒక అడవిగా.. 6.5 లక్షల చెట్లతో చరిత్ర సృష్టించిన సాయాజీ షిండే!

ఇలా వరుస వివాదాలతో పాటు , బడ్జెట్  ఎక్కువ కావడం వల్లే ‘వేల్పరి’ కోసం ఏ స్టార్ ప్రొడక్షన్ హౌస్ ముందుకు రావడం లేదట. ఒకరిద్దరు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, శంకర్ ఈ సబ్జెక్టును ఎలా తెరకెక్కిస్తారో, బడ్జెట్ కంట్రోల్ చేయగలరో లేదో అనే అనుమానాలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్ . అందుకే కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, శంకర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తుంది. తానేంటో, తన మేకింగ్ స్పీడ్ ఏంటో మళ్ళీ నిరూపించుకోవడానికి వీలైనంత వేగంగా ఒక పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తక్కువ సమయంలో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట శంకర్. ఒక యాభై నుంచి వంద కోట్ల లోపు బడ్జెట్ లో పూర్తి చేసే ప్రాజెక్ట్ అయితే ఎవరో ఒక నిర్మాత తప్పకుండా లైన్ లోకి వస్తారనేది ఆయన ప్లాన్.

ఎక్కువ డిమాండ్ చేయని ఒక అద్భుతమైన సబ్జెక్టు

ప్రస్తుతం చెన్నై ఫిల్మ్ నగర్ లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. శంకర్ లాంటి దర్శకుడు ఇప్పుడు ఎవరిని హీరోగా తీసుకుంటారు, క్యాస్టింగ్ ఎలా సెట్ చేసుకుంటారు అనేది తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. లోకేష్ కనగరాజ్ తీసిన ‘ఖైదీ’  ‘విక్రమ్’లా  భారీ సెట్టింగులు, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం కథనం, సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో బడ్జెట్ ఎక్కువ డిమాండ్ చేయని ఒక అద్భుతమైన సబ్జెక్టుని ఆయన సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also read :సీఎం విజయ్ రూట్ మార్చారుగా.. బ్లాక్ సూట్ టు పట్టుపంచె! ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విజువల్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దాదాపు మూడేళ్ళ పాటు ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెరకెక్కించి ఆశించిన బోల్తా పడ్డ శంకర్, ఇప్పుడు అతి తక్కువ సమయంలో వండర్ చేస్తాననడం ట్రేడ్ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినప్పటికీ శంకర్ కెరీర్‌కు ప్రస్తుత సమయంలో ఇదే సరైన మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఈ చిన్న బడ్జెట్ ప్రయోగం ఒకవేళ అటుఇటు అయినా నిర్మాతలకు జరిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. అదే గనక బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయి శంకర్ ఈజ్ బ్యాక్ అనిపిస్తే, ఆయన కలల ప్రాజెక్ట్ ‘వేల్పరి’ నిర్మాణానికి మళ్లీ సులువుగా దారి దొరుకుతుంది. మరి ఈ సీనియర్ లెజెండరీ డైరెక్టర్ తన కొత్త ప్లాన్ తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన డిమోంటీ కాలనీ 3.. కొత్త రిలీజ్ డేట్ లాక్!

నిర్మాతలకు భారీ షాక్ ఇస్తున్న భాగ్యశ్రీ.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనా?

ఆస్కార్ అందుకున్న తొలి మహిళ.. ‘మై లెఫ్ట్ ఫుట్’ నటి మృతి!

Big Stories

Advertisement
×