BigTV English

Aamir Khan: కూతురితో రొమాన్స్.. బాలీవుడ్ బుద్ధి చూపించావుగా.. ఏకీపారేస్తున్న నెటిజెన్స్!

Aamir Khan: కూతురితో రొమాన్స్.. బాలీవుడ్ బుద్ధి చూపించావుగా.. ఏకీపారేస్తున్న నెటిజెన్స్!

Aamir Khan: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంటారు. అయితే ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందిన వారు తిరిగి ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగడం అనేది జరుగుతుంది.ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా కొన్ని సినిమాలలో హీరోలకు కూతురి పాత్రలో చెల్లెలు పాత్రలో నటించిన వారు హీరోయిన్లుగా ఎంటర్ ఇచ్చిన తర్వాత అదే హీరోకి ప్రియురాలిగా భార్యగా నటిస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఇలాంటి పాత్రలలో నటించడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ బాలీవుడ్ స్టార్ హీరో మాత్రం నటిస్తే తప్పేంటంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.


కూతురితో రొమాన్స్ చేస్తే తప్పేంటీ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు అమీర్ ఖాన్(Aamir Khan) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈయనకు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నటి ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaikh) తో కలిసి నటించడంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అమీర్ ఖాన్ నటించిన “దంగల్” (Dangal)సినిమాలో ఫాతిమా అమీర్ ఖాన్ కూతురి పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు అయితే ఈమె 2018 సంవత్సరంలో అమీర్ ఖాన్ హీరోగా నటించిన “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” (Thugs of Hindustan)అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఫాతిమా అమీర్ ఖాన్ ప్రేయసిగా సందడి చేశారు.


నిజమైన తండ్రీ కూతుర్లు కాదు కదా..

ఇలా దంగల్ సినిమాలో కూతురుగా నటించిన అమ్మాయితో తిరిగి ఈ సినిమాలో ప్రియురాలిగా నటించడంతో అప్పట్లో ఈయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అమీర్ ఖాన్ కు ఇదే ప్రశ్న ఎదురయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూతురి పాత్రలో నటించిన అమ్మాయితో తిరిగి రొమాన్స్ చేస్తే తప్పేంటి అంటూ ఈయన మాట్లాడారు.” నిజజీవితంలో మేమేమి నిజమైన తండ్రీ కూతుర్ల కాదు కదా.. స్క్రీన్ పై ప్రేమికులుగా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని దర్శకుడికి చెప్పాం” అంటూ అమీర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి.

కూతురితో సమానం..

ఒకసారి ఒకరిని కూతురుగా ఊహించుకున్న తర్వాత తిరిగి ప్రేయసిగా ఎలా నటిస్తారు అంటూ నెటిజన్స్ అమీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ బుద్ధి బయట పెట్టారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి కృతి శెట్టికి తండ్రి పాత్రలో నటించారు. ఆయన మాత్రం తిరిగి ఆమెతో హీరోగా సినిమా చెయ్యనని, తనతో సినిమా చేసే అవకాశం వచ్చినా వదులుకున్నారు. తనతో సినిమా చేస్తే ఆమె నా కూతురు అనే భావన నాలో ఉంటుందని అందుకే తాను సినిమా చేయనని విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇక అమీర్ ఖాన్ ఇటీవల వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Also Read: కుబేర 2.. హీరోగా ధనుష్ కాదు.. ఇన్నాళ్లకు తెలుగు హీరో విలువ తెలిసిందా?

Related News

Kanyakumari trailer : డేటింగ్ లు లేవు అంతా బ్యాటింగ్ లే, కన్యాకుమారి ట్రైలర్

Ram Charan Peddi: వెనక్కు తగ్గిన రామ్ చరణ్, నానికి ఇదే ప్లస్ పాయింట్

Vishwambhara: విశ్వంభర వాయిదా? 2026 సమ్మర్ రిలీజ్, స్పెషల్ డేట్ ఫిక్స్

Aamir Khan: సిగరెట్ వెలిగిస్తే తప్పేంటి? స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు.!

Dasari Kiran: పోలీసుల అదుపులో రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్!

Rahul Sipligunj: కన్యాకుమారిలో రాహుల్ సిప్లిగంజ్.. నిన్న నిశ్చితార్థం.. నేడు పూజలు

Big Stories

×