Junior Pre Release Event: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాల అవసరం లేదు. ముఖ్యంగా ఈ రోజుల్లో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూడటం మొదలు పెడుతున్నారు. ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా వెతుక్కుని మరీ చూస్తున్నారు. అలానే ఆయా నటులను ఇష్టపడుతున్నారు.
కన్నడలో స్టార్ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. సినిమాల కంటే కూడా ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. అందుకే భాషతో సంబంధం లేకుండా అందరూ ఆయనను ఇష్టపడతారు. శివన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో కూడా శివన్న ఎప్పుడు ముందుంటారు. గాలి జనార్ధన రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా నటించిన జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతుంది.
స్టేజ్ పైన అదరగొట్టిన శివన్న
జూనియర్ మూవీ ఈవెంట్ కు శివన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే రీసెంట్ టైమ్స్ లో జూనియర్ సినిమా నుంచి వైరల్ అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఆ పేరు మాదిరిగానే పాట కూడా విపరీతంగా వైరల్ అయింది. ఆ పాటలో గాలి కిరీటి డాన్స్ చేసిన విధానం చాలా మందిని ఫిదా చేసింది. శ్రీ లీలా బాగా చేస్తుంది అని అందరికీ ఒక క్లారిటీ ఉంది. కానీ గాలి కిరీటి చేయటం అనేది సర్ప్రైజింగ్ గా అనిపించింది. ప్రస్తుతం అదే పాటను స్టేజ్ పైన రీ క్రియేట్ చేశారు. శ్రీ లీలా గాలి కిరీటి తో పాటు శివన్న కూడా స్టెప్స్ వేసి అదరగొట్టారు. శివన్న స్టెప్స్ వేయడంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం అరుపులు, చప్పట్లతో మారుమోగిపోయింది. ఒక చిన్న హీరో సినిమా ఈవెంట్ కి హాజరై అలా డాన్స్ చేయడం శివన్న వ్యక్తిత్వానికి మరో నిదర్శనం.
రిలీజ్ కు భారీ ప్లానింగ్
ఇక ఈ సినిమాకి సంబంధించి భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నాడు హీరో గాలి కిరీటి. అయితే కొన్ని ఇంటర్వ్యూస్ లో గాలి కిరీటి మాట్లాడిన విధానం చాలామంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు గాలి కిరీటికి మంచి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలానే ఒక సందర్భంలో తాను ప్రభాస్ను కలిసినట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం ఆ వీడియోని కూడా ప్రభాస్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా మీద కొద్దిపాటి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా పెద్దపెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం అనేది చెప్పుకోదగ్గ విషయం.
Also Read : HariHara VeeraMallu : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ ఇద్దరు టాప్ దర్శకులు, కానీ అందులో రిస్క్ ఉంది