Ben Stokes: ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ లో భారత స్టార్ పెసర్ మహమ్మద్ సిరాజ్ అదరగొడుతున్నాడు. ఓవర్ నైట్ స్కోర్ 2/0 తో నాలుగవ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే షాక్ ఇచ్చాడు మహమ్మద్ సిరాజ్. బుమ్రా వికెట్లు తీయకపోయినప్పటికీ.. సిరాజ్ మాత్రం వదలడం లేదు. తన అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను పదేపదే ఇబ్బంది పెట్టిన ఈ హైదరాబాద్ పేసర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో భారత్ కి అద్భుత శుభారంభం అందించాడు. ఇరుజట్లు మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో.. లార్డ్స్ టెస్ట్ రసవత్తరంగా మారింది. నాలుగవ రోజు ఆట ఆరంభంలోనే తొలి స్పెల్ లో 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చిన మహమ్మద్ సిరాజ్.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఆరో ఓవర్ వేసేందుకు వచ్చిన మహమ్మద్ సిరాజ్.. ఆ ఓవర్ లో బెన్ డెకేట్ ని అవుట్ చేశాడు. ఆ తర్వాత 12వ ఓవర్ లో ఓలీ పోప్ ని పెవిలియన్ చేర్చాడు. అయితే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో నాలుగవ రోజు బెన్ స్టోక్స్ కి తాకరానిచోట బంతి తగిలింది.
సిరాజ్ బౌలింగ్ లో స్టోక్స్ బాక్స్ బద్దలైంది:
మహమ్మద్ సిరాజ్ దెబ్బకు స్టోక్స్ క్రీజ్ లోనే కుప్పకూలాడు. నొప్పి భరించలేక నేలపై పడుకున్నాడు. నాలుగవ రోజు మహమ్మద్ సిరాజ్ వేసిన 29 ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 29వ ఓవర్ చివరి బంతిని సిరాజ్ షార్ట్ పిచ్ గా వేశాడు. ఆ బంతిని బెన్ స్టోక్స్ బలంగా ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త హైట్ లో ఉండడంతో సరిగ్గా కనెక్ట్ కాలేదు.
ఏకంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చిన ఆ బంతి.. నేరుగా వచ్చి బెన్ స్టోక్స్ గాడ్ కి తగిలింది. ఎంత సేఫ్ గా ఉన్నప్పటికీ.. బంతి నేరుగా తాకడంతో స్టోక్స్ తట్టుకోలేకపోయాడు. వెంటనే పిచ్ పై పడుకున్నాడు. నొప్పితో విలవిలలాడాడు. ఆ తర్వాత టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అతడి దగ్గరికి వెళ్లి ఏమైనా అయ్యిందా అని చూడగా.. ఆ తరువాత మెల్లగా లేచి నిలబడ్డాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Hardik Pandya: మనసు మార్చుకున్న పాండ్య.. నటాషా ఇంటికి వెళ్లి ఎంజాయ్ ?
ఆ తర్వాత ఫిజియోల సాయంతో ప్రథమ చికిత్స తీసుకున్న స్టోక్స్.. అనంతరం బ్యాటింగ్ కొనసాగించాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. పాపం స్టోక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాలుగవ రోజు ఇప్పటివరకు ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు.. 175 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ బెన్ స్టోక్స్ {27*}, క్రిస్ వోక్స్ {8*} ఉన్నారు. ఇక భారత బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్ 2, నితీష్ కుమార్ రెడ్డి 1, ఆకాష్ దీప్ 1, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టారు.
?igsh=N2NpcXNwcmxmMWU5
Oops, hope you are 🆗 Ben Stokes 😳😮
📸: JioHotstar #ENGvIND #Tests #Lords #Insidesport #CricketTwitter pic.twitter.com/UdHSzDluu0
— InsideSport (@InsideSportIND) July 13, 2025