BigTV English

Hari Hara VeeraMallu : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ ఇద్దరు టాప్ దర్శకులు, కానీ అందులో రిస్క్ ఉంది

Hari Hara VeeraMallu : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ ఇద్దరు టాప్ దర్శకులు, కానీ అందులో రిస్క్ ఉంది

Hari Hara VeeraMallu : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా వాయిదాలు పడుతూనే ఉంది. ఈ సినిమాకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. తర్వాత కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు.


ఇకపోతే ఈ సినిమా జులై 24న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ జరగట్లేదు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించనున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

ముఖ్య అతిథులుగా ఆ ఇద్దరు దర్శకులు 


ఈ సినిమా ఈవెంట్ కు ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ లుగా హాజరుకానున్నారు. రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఒక వేదిక మీద చూసి చాలా రోజులైంది. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా వలన వీరిద్దరిని ఒక స్టేజి పైన చూడబోతున్నామని కొంతమంది అభిమానులకు క్యూరియాసిటీ కూడా మొదలైంది. తెలుగు సినిమా ఖ్యాతి ను పెంచిన దర్శకుడు రాజమౌళి. ఇక రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు అంటే ఆ సినిమాకి అంచనాలు కూడా కొంతమేరకు పెరుగుతాయి. కొన్ని సినిమాలకు రాజమౌళి హాజరై ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంటారు. ఈ సినిమా కూడా రాజమౌళి రావడం అనేది ప్లస్ పాయింట్ గా మారుతుంది.

కానీ ఆ సెంటిమెంట్ ఉంది 

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఏ వేడుకైనా కూడా ఇద్దరు కలిసి కనిపిస్తారు. అలానే కొన్ని కార్యక్రమాల్లో కూడా వీరిద్దరే ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశం కూడా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించిన సినిమాలు మినహాయిస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ఇప్పుడు వీరమల్లు పరిస్థితి కూడా అలానే ఉంటుందేమో అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా విషయంలో త్రివిక్రమ్ కొంతమేరకు క్లోజ్ గానే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సెట్స్ కూడా వెళ్లారు. అలానే ట్రైలర్ కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి చూశారు.

Also Read: Deepika Rangaraju : దీపికా రంగరాజుకి ఆ కోరిక ఎందుకు.? ఉన్న ఫేమ్ పాడు చేసుకోవడానికి.?

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×