OTT Movie : గ్రిప్పింగ్ స్టోరీ, వెన్నులో వణుకు పుట్టించే సీన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండే సినిమా ఉంటే తిండి కూడా అక్కర్లేదు అనుకునే మూవీ లవర్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి అంశాలన్నీ మెండుగా ఉన్న మూవీనే ఇది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘Kidnapped’. 2010లో తెరపైకి వచ్చిన ఈ స్పానిష్ హారర్-థ్రిల్లర్ సినిమాలో ఒక కుటుంబం తమ కొత్త ఇంట్లోకి మారగానే ఎదురైన భయంకరమైన పరిణామాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో హర్రర్, వయొలెన్స్, కుటుంబం ధైర్యసాహసాలు చూడొచ్చు. ఇది హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, హోమ్ ఇన్వేషన్ డ్రామా కలిసిన సినిమా. ఈ సినిమా భయంకరమైన రియల్ సీన్స్ తో, 12 లాంగ్ షాట్స్‌తో తెరకెక్కి, ప్రేక్షకులను కథలో మునిగిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే…
జైమ్ (ఫెర్నాండో కాయో), అతని భార్య మార్తా (అనా వాగెనర్), టీనేజ్ కూతురు ఇసా (మాన్యుయెలా వెల్లెస్) మాడ్రిడ్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో కొత్త లగ్జరీ ఇంటికి మకాం మారుస్తారు. ఆ ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశిస్తారు. కానీ జైమ్, మార్తా పెళ్లి బంధంలో సమస్యలు ఉంటాయి. అందుకే ఈ ప్లాన్.
మరోవైపు ఇసా తన స్నేహితుడితో పార్టీకి వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. ఆ రాత్రి ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు హెడ్ థీఫ్ (డ్రిటాన్ బిబా), యంగ్ థీఫ్ (గిల్లెర్మో బారియెంటోస్), స్ట్రాంగ్ థీఫ్ (మార్టిజన్ కుయిపర్) వీళ్ళ ఇంట్లోకి చొరబడతారు. ఆ కుటుంబాన్ని బంధించి, జైమ్‌ను బ్యాంక్ ఎటిఎమ్‌కు తీసుకెళ్లి, అతని క్రెడిట్ కార్డ్‌ల నుండి డబ్బు తీసుకురావాలని బెదిరిస్తారు. లేకపోతే మార్తా, ఇసాను చంపుతామని హెచ్చరిస్తారు.
Read Also : తినడానికి తిండి కూడా లేని వ్యక్తికి 5000 కోట్లు… ట్విస్టులతో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్
హెడ్ థీఫ్ జైమ్‌ను ఎటిఎమ్‌కు తీసుకెళ్తాడు. అయితే యంగ్ థీఫ్, స్ట్రాంగ్ థీఫ్ ఇంట్లో మార్తా, ఇసాను హింసిస్తారు. స్ట్రాంగ్ థీఫ్ క్రూరంగా ఇసాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇసా ధైర్యంగా పోరాడి, అతన్ని ఒక విగ్రహంతో కొట్టి చంపేస్తుంది. ఇంతలో జైమ్ ఎటిఎమ్ దగ్గర తన డబ్బును ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ పోలీసులు రావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది. మరి జైమ్ అక్కడ పోలీసుల హెల్ప్ తీసుకున్నాడా ? ఈ పరిస్థితి నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయట పడింది ? అనేది తెరపై చూడాల్సిందే.