Shobha Shetty in Kissik Talks: బిగ్ బాస్ ఫేం శోభా శెట్టి.. ప్రస్తుతం జనరేషన్ లో లవ్ బ్రేకప్, ఆత్మహత్యలపై స్పందించింది. తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంది. ీ సందర్భంగా ఈ జనరేషన్ లో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ లో జరుగుతున్న ఘటనలపై ఆమె స్పందించింది. ప్రేమ ఫెయిల్ అయ్యిందని ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్. దీనంత ఫూలిష్ థింగ్ మరొకటి ఉండదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమ, ఆశగా పెంచుకుంటారు.
ఆత్మహత్య అనేది సిల్లీ థింగ్..
అలాంటి వాళ్లని ఎవరో టెంపరరీ వ్యక్తి కోసం జీవితాంతం బాధపెడతారా? అలా చేయడం కరెక్ట్ కాదు. వాళ్లు మీ జీవితంలోకి వచ్చి ఎంత కాలం అవుతుంది.. రెండు, మూడేళ్లు అంతేనా? వాళ్ల కోసం తల్లిదండ్రులను బాధపెడతారా? ప్రేమ ఫెయిల్ అయితే వారి కర్మ అని వదిలేసి దాని నుంచి మూవ్ అవ్వాలి. సూసైడ్ అనేది నా దృష్టిలో సిల్లీ థింగ్ అనిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిని చంపింది. అది ఎంత దారుణమైన ఘటన. లవ్ ఫెయిల్ అయితే జీవితం అయిపోతుందా? ఎందుకు ఇలా జీవితాన్ని నాశనం చేసుకోవడం. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ గౌరవించండి’ అని ఆమె పేర్కొంది.
Also Read: Kissik Talks: అలా చేసినందుకే సుదీప్ నన్ను దారుణంగా తిట్టారు.. కన్నడ ‘బిగ్ బాస్’ ఘటనపై శోభాశెట్టి
ప్రేమిస్తే.. చంపేస్తారా?
అనంతర ఈ మధ్య సమాజంలో జరుగుతున్న ప్రేమ ఘటనలపై కూడా స్పందించింది. ప్రేమికుడి కోసం భర్తలను చంపడం చేస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. మీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. ఇంట్లో వాళ్లు వినికపోతే.. పెళ్లి చేసుకున్న వ్యక్తికి చెప్పు. మనకు సెట్ అవ్వదు.. విడిపోదాం అని చెప్పండి. అంతేకాని, ఇలా ఇంకోకరి కొడుకుని చంపడం ఏంటీ? ఎదుటి వారి ఫీలింగ్స్ కి విలువ లేదా? పెళ్లి కి ఇచ్చే వాల్యూ ఇదేనా? ఎదుటి వాళ్ల ఎమోషన్స్ తో ఆడుకోకూడదు.
అప్పుడే ప్రేమ బంధం నిలబడుతుంది
ట్రూగా లవ్ చేసిన వాళ్లని వదిలేసిన కర్మ అనేది ఖచ్చితంగా తగులుతుంది. కర్మ అనేది బుమారాంగ్. ఇది నేను బాగా నమ్ముతాను. ప్రేమించానని నమ్మించి మోసం చేసిన వాళ్లని కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదు. ఇది నేను బాగా నమ్ముతాను’ అని పేర్కొంది. అనంతరం ‘ఇప్పటి జనరేషన్ ప్రేమలో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఎదుటి వ్యక్తి చంపడం చేస్తున్నారు. అది ప్రేమ కాదు. ఇద్దరు ప్రేమికుల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండాలి. లవ్ గొడవలు కామన్. అవి ఉంటేనే ఆ ప్రేమ నిజమైంది. ఒకరిని ఒకరు ఇష్టపడుతూ.. ఒకరి పట్ల ఒకరు గౌరవంతో ఉండాలి. ఒకరి నిర్ణయాలను ఒకరు రెస్పాక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆ ప్రేమ నిలబడుతుంది’ అని చెప్పుకొచ్చింది.
Also Read: Kissik Talks: గోవా వీడియో.. బాయ్ ఫ్రెండ్ తో గొడవలు.. పెళ్లి వద్దురా బాబూ అనిపించింది..