Shobha Shetty About Clashes With Boyfriend: బిగ్ టీవీలో ప్రసారమవుతున్న కిస్సిక్ టాక్స్ బుల్లితెర బ్యూటీ, బిగ్ బాస్ ఫేం శోభా శెట్టి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా తన కెరీర్, పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తెలుగు బిగ్ బాస్ 7వ సీజన్ లో పాల్గొన్న ఆమె బాయ్ ప్రెండ్ ని పరిచయం చేసింది. బిగ్ బాస్ ద్వారా తన రిలేషన్ కన్ఫాం చేస్తూ.. యశ్వంత్ త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు ప్రకటించింది. చెప్పినట్టుగానే హౌజ్ నుంచి బయటకు రాగానే బాయ్ ఫ్రెండ్ ని నిశ్చితార్థం చేసుకుంది. ఎంతో గ్రాండ్ వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక త్వరలోనే ముహుర్తాలు పెట్టేసి పెళ్లి కబురు చెబుతుందని అభిమానులంత ఆశగా ఎదురుచూస్తున్నారు.
పెళ్లి ఎప్పుడంటే..
కానీ ఇంతవరకు పెళ్లిపై ఊసే లేదు. నిశ్చితార్థం జరిగి రెండేళ్లు కావోస్తోన్న ఇప్పటి వరకు శోభా నుంచి గుడ్ న్యూస్ రావడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట తెగ సందడి చేస్తుంది. తరచూ జంటగా ఫోటో షూట్ లకు ఫోజులు ఇస్తున్నారు. కానీ, పెళ్లి కబురు మాత్రం రావడం లేదు. దీంతో శోభా పెళ్లిపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా కిస్సిక్ టాక్స్ లో పాల్గొన్న ఆమె తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఇంట్లోనే నేనేన చిన్న. అందుకే నా పెళ్లిని చాలా గ్రాండ్ గా చేద్దామని అనుకున్నారు. గతేడాది పెళ్లి చివరి లేదా 2025లో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ, మా అమ్మ హెల్త్ బాగాలేదు. తను చికిత్స కోసం తరచూ ఆస్పత్రికి వెళ్లడం అదే జరుగుతుంది. ఇలాంటి టైంలో పళ్లి పెట్టుకోవడం కరెక్ట్ కాదనిపిచ్చింది. తన ఆరోగ్యం కుదుట పడ్డాక ఈ ఏడాది చివరిలో లేదా నెక్ట్స్ ఇయర్ జనవరిలో అయినా పెళ్లి ఉండోచ్చు’ అని అసలు విషయం చెప్పింది.
గోవా వీడియో.. బాయ్ ఫ్రెండ్ తో గొడవ..
యశ్వంత్, నువ్వు గొడవ పడుతుంటారా అని హోస్ట్ ప్రశ్నించగా.. రిలేషన్ షిప్ అన్నాక గొడవలు లేకుండ ఉంటాయా? అని సమాధానం ఇచ్చింది. ‘అందరిలో మాకు కూడా తరచూ గొడవలు అవుతుంటాయి. వీడితో ఎందుకురా బాబూ.. వదిలేద్దామని ఆల్మోస్ట్ అనుకుంటాను. కానీ, ఆ లోపు యశ్వంత్ వచ్చి సారీ చెప్పడం.. నన్ను కన్వీన్స్ చేస్తుంటాడు. దీంతో మళ్లీ మేం కలిసిపోతాం. రిలేషన్ షిప్ లో గొడవలు అనేవి సహజం. అంత మాత్రానికే విడిపోవడం లాంటివి చేయరాదు. రిలేషన్ షిప్ లో ఉండేవారికి నేనిచ్చే సలహా ఇదే’ అని చెప్పింది. ఇక వర్షంలో స్విమ్మింగ్ ఫూల్ వీడియో శోభా స్పందించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వీడియో ప్లాన్ చేసి తీసింది కాదని చెప్పింది. తను, యశ్వంత్ గోవా వెళ్లామని, అప్పుడు తీసిన వీడియో అని చెప్పింది. ‘గోవా వెళ్లినప్పుడ సరదాగా చీరకట్టుకున్నాను. అప్పుడే వర్షం పడుుతంది. క్లైమాట్ కూడా బాగుంది. అప్పటికప్పుడు ఆ సిచ్చ్యూవేషన్ బట్టి తీసిన వీడియో. యశ్వంతే ఆ వీడియో తీశాడు. దానికి ఆ సాంగ్ సెలక్షన్ కూడా తనదేది. తనే ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు’ అని తెలిపింది.
పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి: