OTT Movie : విజయ్ ఆంటోనీ నిర్మించి, నటించిన ఒక థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇది సూపర్ నాచురల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో హైదరాబాద్‌లో జరిగే దారుణమైన సీరియల్ కిల్లింగ్స్‌ని ఛేదించేందుకు, ముంబై నుంచి ధ్రువ్ (విజయ్ ఆంటోనీ) అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఈ కిల్లర్ ని పట్టుకునే క్రమంలో స్టోరీ అసాధారణ మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ సూపర్‌నాచురల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Maargan’. 2025లో వచ్చిన ఈ సినిమాకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ ఆంటోనీ, అజయ్ దిషాన్, సముద్రఖని, బ్రిగిడా సాగా, దీప్శిఖ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ ఆంటోనీ నిర్మించిన ఈ సినిమా 2025 జూన్ 27న థియేటర్లలో రిలీజ్ అయింది. 132 నిమిషాల రన్‌టైమ్‌తో, IMDbలో ఈ సినిమాకి 7.7/10 రేటింగ్ ఉంది.
ఈ సినిమా 2025 జులై 25 నుంచి Amazon Prime Video, Tentkotta లలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : వేస్టుగాడని విడాకులిచ్చే పెళ్ళాం… కట్ చేస్తే డస్ట్ బిన్ తో కోటీశ్వరుడిగా… ఇదేందయ్యా ఇదీ
హైదరాబాద్‌లో రమ్య అనే యువతి దారుణంగా హత్యకు గురవుతుంది. ఆమె శరీరం ఒక విచిత్రమైన ఇంజెక్షన్ డ్రగ్ వల్ల నల్లగా మారి చనిపోతుంది. ఈ కేసు ముంబై ADGP ధ్రువ్ (విజయ్ ఆంటోనీ) దృష్టికి వస్తుంది. ఎందుకంటే ఇది అతని కూతురు ప్రియా హత్య కేసుతో సిమిలారిటీస్ కలిగి ఉంటుంది. ప్రియా గతంలో సదిక్ అనే క్రిమినల్ చేత ఇలాంటి డ్రగ్‌తోనే చనిపోయింది. ధ్రువ్ ఈ ట్రాజెడీ వల్ల మానసికంగా బ్రోకెన్‌గా ఉంటూ, చెన్నైకి వచ్చి ఇన్స్‌పెక్టర్ శృతి, కానిస్టేబుల్ కాళి సహాయంతో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ దర్యాప్తులో అరవింద్ అనే వ్యక్తిని సస్పెక్ట్‌గా అనుమానిస్తారు. అరవింద్ కి అసాధారణ సూపర్‌నాచురల్ శక్తి ఉందని తెలుస్తుంది. ఈ శక్తితో అతను నీటిలో డైవ్ చేసి మెమరీలను రీకాల్ చేయగలడు. ధ్రువ్ మొదట అతన్ని కిల్లర్‌గా అనుమానిస్తాడు. కానీ అతను నీటిలో డైవ్ చేసి రమ్య హత్య సమయంలో చూసిన ఒక షాడోని గుర్తిస్తాడు. దీనితో CCTV ఫుటేజ్ ద్వారా అతని నిర్దోషిత్వం నిరూపితమవుతుంది. ధ్రువ్ తన కూతురు హత్య కథను అరవింద్ తో షేర్ చేసి, అతని సహాయం తీసుకుంటాడు.
ఇదిలా ఉంటే, వెన్నిలా అనే మోడల్ నెక్స్ట్ టార్గెట్‌గా అనుమానించబడుతుంది. ఆమె ఒక బయోపిక్ రోల్ కోసం స్కిన్-లైటెనింగ్ చేయించుకుంటుంది. కానీ ప్రొడ్యూసర్ సానా ఆమె స్థానంలో వేరే మోడల్ ని తీసుకుంటుంది. దీంతో వెన్నిలా కోపంతో ఊగిపోతుంటుంది. ఇక ధ్రువ్ టీమ్ వెన్నిలా డ్రెస్‌లో సీక్రెట్ గా స్పై కెమెరా పెట్టి, మహాబలిపురంలో జరిగే పార్టీని ఫాలో చేస్తుంది. అరవింద్ ఆమె ఇంటిని గార్డ్ చేస్తుండగా, అతన్ని ఎవరో కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. అరవింద్ తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత, షాకింగ్ ట్రూత్ బయటపడుతుంది. ఇక్కడ కిల్లర్ ఎవరోకాదు వెన్నిలానే. నిజానికి ఒక రోజు ఆమెను తన బాయ్‌ఫ్రెండ్ అందంగా లేదని అవమానిస్తాడు. దీంతో ఆమె అందమైన స్కిన్ ఉన్న మహిళలపై పగతో ప్రియా, రమ్యలను టార్గెట్ చేసి చంపింది. ఇక క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. ధ్రువ్ ఆమెను పట్టుకుంటాడా ? వెన్నిలా ఇంకెవరినైనా టార్గెట్ చేస్తుందా ? క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.