Anupama Parameswaran:అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మలయాళీ బ్యూటీ అయిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సొంతం చేసుకుంది. అందం, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు మరొకసారి ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలోనే ఆమె నటించిన తాజా చిత్రం పరదా(Parada).. ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వంలో ఆగస్టు 22వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమతో పాటు సీనియర్ హీరోయిన్ సంగీత (Sangeeta ), దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పరదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న అనుపమ..
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించగా.. అటు అనుపమ కొత్త అవతారం, కథ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి
దీనికి తోడు ప్రవీణ్ కండ్రేగుల సినీ ప్రేక్షకులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సినిమా రివ్యూ చూసి ఆ తర్వాత సినిమాకి రండి అని చెప్పారు. దీంతో ఈయనకు ఈ సినిమాపై ఎందుకు అంత కాన్ఫిడెంట్ అని అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆనంద మీడియా బ్యానర్ పై శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బ్రిడ్జిపై నుండి కింద పడిపోయిన అనుపమ..
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమా షూటింగ్లో జరిగిన ఒక కీలక సన్నివేశంపై కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె మాట్లాడుతూ.. బ్రిడ్జిపై ఒక కీలక సన్నివేశం కోసం షూటింగ్ జరుగుతోంది. అయితే ఆ స్క్రీన్ లో స్క్రిప్ట్ ప్రకారం నేను బ్రిడ్జి పైనుంచి కిందకి పడాలి. డైరెక్టర్ షార్ట్ రెడీ అని చెప్పగానే.. కెమెరాలు రికార్డు అవుతుండగా.. అకస్మాత్తుగా నాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఇక నొప్పి తట్టుకోలేక స్క్రిప్ట్ లో ఉన్నట్టుగానే నేను కింద పడిపోయింది. ఆ క్షణంలో చిత్ర బృందం ఎవరికి ఇది నిజంగా జరిగిందని తెలియదు. అందరూ నన్ను చాలా బాగా చేసిందని, అద్భుతం అని, సూపర్ షాట్ అంటూ తెగ పొగిడేసారు. కానీ కొద్ది క్షణాలకే నాకు సరిగ్గా లేదని గుర్తించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంటూ అనుపమ పరమేశ్వరన్ తెలిపారు.
యాక్టింగ్ కాస్త రియాలిటీగా మారిపోయింది – అనుపమ
ఇక దీన్ని బట్టి చూస్తే ఆ క్షణంలో యాక్టింగ్ కాస్త రియాలిటీ అయిపోయింది.. మొదట నటన అనుకున్నా.. అది నిజం అని తెలిసి ఆశ్చర్యపోయారు” అని అనుపమ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఏది ఏమైనా అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలు నిజజీవితంలో జరిగి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా అనుష్కకు అరుంధతి ఎలాగో అనుపమకు పరదా అలాగా మారుతుందని.. డైరెక్టర్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాతో తనకు పేరు కాదు.. డబ్బులు కావాలి అని కూడా స్పష్టం చేశారు.
ALSO READ:Kakinada Sridevi: ఏంటీ.. కోర్ట్ మూవీ బ్యూటీకి పెళ్లయిందా.. మెడలో ఆ పసుపు తాడేంటి?