BigTV English

Gopichand: ‘శూల’తో వస్తున్న గోపీచంద్… ఈ సారైనా దింపుతాడా?

Gopichand: ‘శూల’తో వస్తున్న గోపీచంద్… ఈ సారైనా దింపుతాడా?

Gopichand:గత పది సంవత్సరాలుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో గోపీచంద్ (Gopichand) ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో తన కొత్త సినిమా ప్రకటించారు. తన 46వ పుట్టినరోజు సందర్భంగా.. తన 33వ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఘాజీ, అంతరిక్షం లాంటి హిట్ సినిమాలు చేసిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా అనేసరికి ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి. ఏడవ దశాబ్దంలోని భారతీయ చరిత్రలోని ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


గోపీచంద్ 33వ సినిమా.. పరిశీలనలో శూల టైటిల్..

ముఖ్యంగా ఈ సినిమాలో తన పాత్ర కోసం గోపీచంద్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రత్యేకము కాబోతున్నట్లు సమాచారం . ఇక భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిత్తూరి పవన్ కుమార్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాకి ‘శూల’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.’శూల‌’ అనేది ఓ ప్ర‌దేశం పేరు. క‌థ‌లో ఈ ప్ర‌దేశానికి చాలా ప్రాముఖ్యం ఉంది అని తెలుస్తోంది. అసలే దశాబ్ద కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఈ శూల సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటారో లేదు చూడాలి.


గోపీచంద్ సినిమా కెరియర్..

మ్యాచో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మంచి హైట్, పర్సనాలిటీ ఉండి ఉండి కూడా సరైన కథ పడక ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా యాక్షన్స్ సినిమాలకు సరిగ్గా సెట్ అయ్యే గోపీచంద్ సరైన కథలను ఎంచుకోవడంలో కూడా కాస్త వెనకడుగు వేసారని చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలి అంటే 2014లో విడుదలైన ‘లౌక్యం’ సినిమా తర్వాత మళ్లీ ఆయన ఖాతాలో ఇంకో హిట్ పడలేదు. అప్పటినుంచి రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా హిట్ సాధించడంలో విఫలం అయ్యాడు. ఇప్పటికే పలువురు దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ ను అందుకోవడంలో భారీగా వెనుక పడ్డాడని చెప్పవచ్చు.

గోపీచంద్ సినిమాలు..

ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు గోపీచంద్. అలాగే మరో యంగ్ డైరెక్టర్ కుమార్ వెల్లంకి తో కూడా మరో సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమా విషయంలో కూడా కథ చాలా అద్భుతంగా ఉందని సమాచారం. ఒకవేళ ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా అయినా సరే హిట్ సాధించింది అంటే ఈ సినిమాతో గోపీచంద్ మళ్లీ గట్టి కం బ్యాక్ ఇస్తారని చెప్పవచ్చు.. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఈయనను హీరోగా నిలబెడుతుందో చూడాలి.

ALSO READ:Niharika: జోరు పెంచిన మెగా డాటర్.. పట్టాలెక్కిన రెండో మూవీ.. నటీనటులు వీరే!

Related News

Tollywood Cine Workers : జీతాల పెంపు.. సినీ కార్మికులకు లేబర్ కమీషన్ పెట్టిన కండీషన్స్ ఇవే..!

Mahavathar Narasimha : ఈ వీకెండ్ కూడా యానిమేషన్ మూవీదే హవా.. అక్కడ కూలిపోయిన ‘కూలీ’..

Mass Jathara : మాస్ జాతర టీం కు లీగల్ నోటీసులు, నిర్మాత వంశీకి దెబ్బ మీద దెబ్బ

Sreeleela: శ్రీలీలా హీరోయిన్ అవ్వడం వెనక ఎన్టీఆర్, బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ చేసిన శ్రీలీలా మదర్

Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు

Nara Rohit: పొలిటికల్ ఎంట్రీపై హీరో క్లారిటీ.. ఆ అపోహలకు చెక్!

Big Stories

×