Ind vs Eng 2nd test : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు సిరీస్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన టాస్ తాజాగా వేశారు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మళ్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. వాస్తవానికి ఎడ్జ్ బాస్టన్ బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు తొలుత టాస్ గెలిస్తే.. ఫీల్డింగ్ ఎందుకు ఎంచుకుంటుందో అర్థం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఎడ్జ్ బాస్టన్ లో జరిగే మ్యాచ్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ కి దూరమయ్యాడు. బుమ్రా దూరమైనప్పటికీ.. నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా టీమిండియాకి తిరుగుండదు.
బుమ్రా ఔట్..
వాస్తవానికి రెండో టెస్ట్ వేదిక అయిన బర్మింగ్ హా్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానం.. ఇప్పటివరకు టీమిండియా ఇక్కడ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు. అసలే తొలి టెస్ట్ ఓటమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కి ఈ మ్యాచ్ గెలవడం పెద్ద సవాల్ తో కూడిన విషయం అనే చెప్పాలి. ఇలాంటి కఠినమైన పిచ్ పైనా సెంచరీలు చేసిన భారత బ్యాటర్లూ ఉన్నారు. వారిలో ఇద్దరూ రిటైర్మెంట్ కాగా.. మరో ఇద్దరూ ప్రస్తుత జట్టులో సభ్యులుగా ఉన్నారు. అలాగే ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా దాదాపు 30 ఏళ్ల నుంచి ఒకరి పేరే కొనసాగుతుండటం గమనార్హం. ఎడ్జ్ బస్టన్ వేదికగా టెస్టు చరిత్రలో 86 సెంచరీలు నమోదు కాగా.. భారత్ నుంచి నలుగురు మాత్రమే ఉన్నారు. ఇంగ్లాండ్ పై సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ ఈ జాబితాలో ఉన్నారు. ఇక అన్ని మ్యాచ్ ల్లో కూడా భారత్ ఓడిపోయింది. కోహ్లీ రికార్డును అధిగమించాలంే గత టెస్టులో సెంచరీలు చేసిన బ్యాటర్లకు అవకాశం ఉంది.
బ్యాటింగ్ జట్టుదే విజయం..
విరాట్ కోహ్లీ 2018లో 149 పరుగులు చేయగా.. 1996 లో సచిన్ 122 పరుగులు 2022లో రిషబ్ పంత్ 146 పరుగులు, రవీంద్ర జడేజా 2022లో 104 పరుగులు చేశారు. ఎడ్జ్ బాస్టన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఇంగ్లాండ్ కి చెందిన జెమ్స్ అండర్సన్. ఈ మాజీ పేసర్ 14 మ్యాచ్ ల్లో 52 వికెట్లు తీశాడు. భారత్ తరపున చేతన్ శర్మ అనే మాజీ బౌలర్ 10 వికెట్లతో టాపర్ గా కొనసాగుతున్నాడు. ఇవన్నీ ఒకే మ్యాచ్ లో తీయడం ఇప్పటికీ భారత్ తరపున ఘనతే. దాదాపు 39 సంవత్సరాల కిందట 1986లో ఆ రికార్డును చెరిపేయడం చాలా కష్టం అనే చెప్పాలి. బుమ్రా తుది జట్టులో ఉంటే ఏమైనా సాధ్యమయ్యేదేమో.. కానీ ప్రస్తుతం అతడు ఆడటం పై అనుమానాల నేపథ్యంలో ఇతర బౌలర్ల పై ఆశలు తక్కువ అనే చెప్పాలి. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ సార్లు విజయం సాధించింది.
టీమిండియా :
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, జడేజా, నితిశ్ రెడ్డి, ఆకాశ్ దీప్, సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
ఇంగ్లాండ్ జట్టు :
క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, టంగ్, బషీర్.