Niharika:నిహారిక కొణిదెల (Niharika Konidela).. మెగా డాటర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. మొదట యాంకర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్ గా కూడా ప్రయత్నం చేసిందిమీ కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అటు ఈ ఏడాది తమిళంలో కూడా సినిమా చేసి.. ఇందులో ఎన్నడూ నటించని రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక దీంతో నటన రంగానికి స్వస్తి పలికిన ఈమె ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బ్యానర్ ద్వారా ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే సినిమా చేసి సక్సెస్ అయ్యింది.. ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్ లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి పై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డుతోపాటు చిత్ర దర్శకుడు యదు వంశీకి కూడా ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా గద్దర్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.
ఘనంగా నిహారిక రెండవ సినిమా పూజా కార్యక్రమాలు..
ఇలా మొదటి ప్రయత్నంలోనే భారీ సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు జోరు పెంచేసింది నిహారిక. అందులో భాగంగానే తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రెండో సినిమాని కూడా ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా పూర్తయ్యాయి. ఈ మేరకు ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేసింది. ఇక నిహారిక ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న రెండవ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
నటీనటులు వీరే..
అసలు విషయంలోకి వెళ్తే నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న రెండో సినిమాకి మానస శర్మ (Manasa Sharma)దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలలో అద్భుతమైన నటన కనబరిచి, ప్రతిభావంతుడిగా, యువ కథా నాయకుడిగా పేరు సొంతం చేసుకున్న సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సంగీత్ కి జోడిగా యంగ్ బ్యూటీ నయన్ సారిక (Nayan Sarika)నటిస్తోంది. ఇప్పటికే ఈమె ‘ఆయ్’ , ‘క’ వంటి చిత్రాలలో నటించి, మెప్పించింది. అంతేకాదు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ 5 వారి ‘హలో వరల్డ్’, సోనీ లివ్ వారి ‘బెంచ్ లైఫ్’ వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ఇక వీరితో పాటు ఈ సినిమాలో వెన్నెల కిషోర్ (Vennela Kishor), ఆశిష్ విద్యార్థి(Ashish Vidhyarthi), బ్రహ్మాజీ(Brahmaji), సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి తో పాటు మరికొంతమంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథల ఎంపిక విషయంలో ఇప్పుడు నిర్మాతగా సక్సెస్ అయిన నిహారిక తన రెండవ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి అని అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ALSO READ:Dil Raju: ప్రశాంత్ నీల్ – బన్నీ కాంబో మూవీ.. టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన దిల్ రాజు!