Kanakavva Top Folk Songs:కనకవ్వ ఆలియాస్ గొట్టే కనకవ్వ గా తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా ఫోక్ లవర్స్ కి బాగా దగ్గరైన కనకవ్వ నెట్టింట దూసుకుపోతుంది.ముఖ్యంగా తనదైన గొంతుతో వరుస ఫోక్ సాంగ్స్ పాడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది,ముఖ్యంగా కనకవ్వ గాత్రం ఇస్తే చాలు పాట మిలియన్ల వ్యూస్ పక్కా అన్నట్టుగా అయిపొయింది.మరి కనకవ్వ గొంతు నుండి కాలు వారి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆ పాటలేంటో మనమూ ఒకసారి చూసేద్దాం.
వినిపించే పాట ‘నర్సపల్లె’
ముందుగా కనకవ్వ అనే పేరు చెప్పగానే వినిపించే పాట ‘నర్సపల్లె’.మంగ్లీ తో కలిసి కనకవ్వ ఈ పాట పాడగా మంగ్లీ,జాను లిరి ఈ పాటకి స్టెప్పులేశారు.ఇక ఇందులో కనకవ్వ కూడా సరదాగా కనిపించడం విశేషం. ఇక ఈ పాటని కాసర్ల శ్యామ్ రాయగా,మదీన్ SK తనదైన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేశాడు.ఇక ఈ పాటకి స్వయంగా జానులిరి యే కోరియోగ్రఫీ అందించడం మరో విశేషం.ఇక దాము రెడ్డి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ పాట ఇప్పటికి 6 ఏళ్లలో 370మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుందంటే పాట ఆడియన్స్ ని ఎంతలా అలరించిందో చెప్పొచ్చు.
ఇక ‘గిజ్జగిరీ‘ అంటూ మంగ్లీతో ఆడిపాడిన ఈ పాట కూడా కనకవ్వ పాడిన పాటల్లో టాప్ లో ఉంటుంది.పల్లె జీవితాన్ని,మట్టి వాసనలని, మనుషుల్లో ఉండే స్వచ్చతని తన గొంతులో పలికించడం వల్లే కనకవ్వ పాడిన పాటలకి మిలియన్ల మంది ఫిదా అవుతున్నారు.కాసర్ల శ్యాం రాసిన ఈ పాట కూడా ఆ కోవలోనిదే అని చెప్పాలి.ఫోక్ ఇండస్ట్రీని శాసిస్తున్న మదీన్ SK నే దీనికి కూడా మ్యూజిక్ అందించగా ఈ పాట కూడా మూడేళ్ళలో 33 మిలియన్ల వ్యూస్ ని వెనకేసి కనకవ్వ సత్తా ఏంటో ప్రూవ్ చేసింది.
ఇక కనకవ్వ నుండి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన మరో పాటగా ‘అవ్వ పాట’ని చెప్పుకోవాలి.మనవడికి,అవ్వకి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో స్వచ్చంగా చూపెట్టిన ఈ పాటని యష్ పాల్ రాయగా ఎ ఫ్రాయిమ్ తనదైన మ్యూజిక్ తో మరో లెవెల్ లో పెట్టేశాడు.అలా హన్మంత్ యాదవ్ తో కలిసి కనకవ్వ పాడిన ఈ పాట ఇప్పటికే ఏకంగా వచ్చిన మూడేళ్ళలో 36 మిలియన్ల వ్యూస్ ని వెనకేసి కనకవ్వ గొంతులోని మ్యాజిక్ ని మరోసారి ఆడియన్స్ కి చూపించింది.
ఇక గరివిడి లక్ష్మి తో సాలిడ్ అందుకున్న చరణ్ అర్జున్ సంగీతం అందించిన ‘మేడారం పాట’ కూడా కనకవ్వ లిస్టు లో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. ముఖ్యంగా యష్ పాల్ అందించిన లిరిక్స్ ఈ పాటకి మెయిన్ ఎసెట్ కాగా మంగ్లీ, కనకవ్వ, చరణ్ అర్జున్ కలిసి పాడిన తీరు పాటని మరో రేంజ్ కి తీసికెళ్ళింది. ఈ పాటకి వచ్చిన 64 మిలియన్ల వ్యూస్ ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తుంది కూడా
ఇక కనకవ్వ పాడిన ‘టుంగుటుయ్యాల‘ కూడా ఆడియన్స్ ని, ముఖ్యంగా ఫోక్ లవర్స్ ని ఫిదా చేసిందే. కనకవ్వ జయశ్రీ హనీ కలిసి పాడిన ఈ పాటకి గతించిన కందికొండ లిరిక్స్ అందించారు.తెలంగాణా మట్టి వాసనని ,స్వచ్చతని ,పరిమళాన్ని జీవన విధానాన్ని తన కలంతో అలవోకగా పాడించే కందికొండ లేకపోవడం బాధాకరం.ఇక బోలేశావాలి మ్యూజిక్ అందించిన ఈ బతుకమ్మ పాట వచ్చిన 6 ఏళ్ళల్లో 2 కోట్ల మందికి పైగా చూడటం విశేషం.
ఏది ఏమైనా సిద్ధిపేట లోని అక్కనపేట మండలం బొడిగెపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ ఎన్నో కష్టాల కోర్చి పాటనే తన శ్వాసగా మార్చుకున్న తీరు, ఇలా మిలియన్ల వ్యూస్ ని వెనకేస్తున్న క్రమం ఎందరికో ఆదర్శప్రాయం అని చెప్పకతప్పదు !
ALSO READ :జాను లిరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఏవో తెలుసా?టాప్ ఫోక్ సాంగ్స్ ఇవే!