E-Paper
Advertisement

చిట్టి ఈసారి ఏం చేస్తుందో..ఫరియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో జోష్!

చిట్టి ఈసారి ఏం చేస్తుందో..ఫరియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో జోష్!
Advertisement

Sigma Movie:సినిమా రిలీజ్‌ దగ్గర పడుతుందంటే చాలు ప్రమోషన్స్ లో వేగం పెంచేస్తుంది మూవీ టీమ్.ఇదిగో అలాగే ఇప్పుడు తను నటించిన సిగ్మా పై తనదైన శైలిలో ఒక పోస్ట్ వదిలింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.
“1 day to go and then Sigma is all yours..” అంటూ ఫరియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అలెర్ట్ అయిపోయారు చిట్టి ఫ్యాన్స్. ఇక . సినిమా రిలీజ్‌కు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండటంతో ఈ పోస్ట్‌తో ‘సిగ్మా’పై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది.

విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా

Advertisement

సుందీప్ కిషన్ హీరోగా నటించిన ‘సిగ్మా’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెల్సిందే. దీంతో సినిమా మొదలైనప్పటి నుంచే సినిమా ఎలా ఉండబోతుందా అన్న డిస్కషన్ మొదలిపోయింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించడం విశేషం.

సందీప్ కిషన్ కెరీర్‌లో మరో డిఫరెంట్ సినిమా

Advertisement

ఇక ‘సిగ్మా’సాధారణమైన లవ్ స్టోరీ లేక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాదని ,ట్రెజర్ హంట్, ఛేజింగ్‌లు, యాక్షన్ సీన్స్ వంటివి ఎన్నో ఉన్నాయని ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. అంతే కాకుండా దానిని బ్యాలెన్స్ చేస్తూ కామెడీ ని కూడా బ్లెండ్ చేశారని తెలుస్తుంది.దీంతో సందీప్ కిషన్ కెరీర్‌లో మరో డిఫరెంట్ సినిమాగా ‘సిగ్మా నిలిచే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

ఇక ఫరియా అబ్దుల్లా విషయానికి వస్తే.. ‘జాతి రత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సంగతి తెల్సిందే. ఆ సినిమాలో చిట్టి పాత్రలో ఫరియా చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. . ఆ తర్వాత వరుస సినిమాల్లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రావణాసుర’ వంటి సినిమాల్లో నటించిన ఫరియా.. హీరోయిన్ గానే కాకుండా వెరైటీ పాత్రలపై కూడా ఫోకస్ పెట్టడం విశేషం.

ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

ఇక ‘సిగ్మా’అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుండటం తో ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో ఫరియా చేసిన “1 day to go” పోస్ట్ కూడా ఇపుడు ఆడియన్స్ లో హైప్ పెంచేసింది . చూడాలి మరి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

Tags

Related News

జానీ మాస్టర్ లవ్ స్టోరీ తెలుసా?..అసలు ట్విస్ట్ ఇదే!

రెండు వారాల్లోనే రూ. 1.3 కోట్ల ఆదాయం.. విజయ్ దేవరకొండ ‘అన్ హైప్’ దూకుడు!

చిరంజీవి బ్లడ్ అమ్ముకుంటున్నారట.. తమ్మారెడ్డి ఇచ్చిన లాజిక్ అదిరిపోయిందిగా!

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారంటే?

సుడిగాలి సుధీర్ ‘గోట్’కు మరో రిలీజ్ డేట్.. ఈసారి ఏమవుతుందో?

కుకూన్స్ పోస్టర్ చూశారా? అనిల్ రావిపూడి కూడా ఫిదా!

సుమలతకు ఫెడరేషన్‌లో నో ఎంట్రీ.. ఛాంబర్ దగ్గర రచ్చ రచ్చ!

Big Stories

Advertisement
×