E-Paper
Advertisement

రెండు వారాల్లోనే రూ. 1.3 కోట్ల ఆదాయం.. విజయ్ దేవరకొండ ‘అన్ హైప్’ దూకుడు!

రెండు వారాల్లోనే రూ. 1.3 కోట్ల ఆదాయం.. విజయ్ దేవరకొండ ‘అన్ హైప్’ దూకుడు!
Advertisement

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.ఇక ఈయన థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ తో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ ఇటీవల అన్ హైప్(Un Hype) పేరుతో స్కిన్ కేర్ ప్రోడక్ట్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదు.

అన్ హైప్ కు భారీ ఆదరణ…

ఇలా విజయ్ దేవరకొండ ప్రారంభించిన ఈ అన్ హైప్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ కు భారీ స్థాయిలో ఆదరణ లభించిందని చెప్పాలి. ఈ సమస్త విడుదల చేసిన విజయ్ దేవరకొండ సిగ్నేచర్ రొటీన్స్ రెండు వారాలలోనే సుమారు 10000 వరకు అమ్ముడుపోయాయని తద్వారా 1.3 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. విజయ్ దేవరకొండ సిగ్నేచర్ రొటీన్ కోసం సెప్టెంబర్ 11న ప్రీ బుకింగ్ప్రాస్ ప్రారంభమయ్యాయి అయితే మొదటి షిప్పింగ్ సెప్టెంబర్ 21వ తేదీ ప్రారంభించాలని భావించారు కానీ రెండు వారాల వ్యవధిలోని ప్రీ అయిపోయాయి. ఇలా అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ప్రొడక్ట్స్ అమ్ముడుపోవడంతో విజయ్ దేవరకొండ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

సంతోషం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ…

Advertisement

ఈ విషయంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అన్ హైప్ తమ రోజువారి స్కిన్ కేర్ లో భాగం చేసుకోవడానికి, తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలని తెలిపారు. తాము కూడా చాలా నమ్మకంతో ఈ ప్రొడక్ట్స్ మీ ముందుకు తీసుకు వచ్చాము కానీ రెండు వారాలలోనే ఈ స్థాయిలో ఆదరణ వస్తుందని అసలు ఊహించలేదని, చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రోడక్ట్ మొత్తం పూర్తి అయ్యాయి, త్వరలోనే రీ స్టాక్ చేస్తామని తెలిపారు. ఈ ప్రోడక్ట్ దొరకని వారికి క్షమాపణలు తెలియజేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అన్ హైప్ నుంచి ఇంకా చాలా ప్రొడక్ట్స్ రాబోతున్నాయని తెలిపారు. త్వరలోనే మా ఉత్పత్తులను సంస్థ వెబ్ సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు.

రణబాలి ప్రమోషన్లలో బిజీగా..

ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ ప్రారంభించిన రెండు వారాలలోనే కోట్లలో ఆదాయం రావడం అంటే మామూలు విషయం కాదు ఇలా బిజినెస్ లో విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ అందుకున్నారని, ఇలాగే మరి కాస్త సక్సెస్ అందుకోవాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన రణబాలి (Ranabali) సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.

Advertisement

Also Read: నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

Related News

పోస్టర్లు అదిరిపోయాయి.. సినిమాలు మాత్రం బొక్కబోర్లా పడ్డాయి!

జానీ మాస్టర్ లవ్ స్టోరీ తెలుసా?..అసలు ట్విస్ట్ ఇదే!

చిట్టి ఈసారి ఏం చేస్తుందో..ఫరియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో జోష్!

చిరంజీవి బ్లడ్ అమ్ముకుంటున్నారట.. తమ్మారెడ్డి ఇచ్చిన లాజిక్ అదిరిపోయిందిగా!

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారంటే?

సుడిగాలి సుధీర్ ‘గోట్’కు మరో రిలీజ్ డేట్.. ఈసారి ఏమవుతుందో?

కుకూన్స్ పోస్టర్ చూశారా? అనిల్ రావిపూడి కూడా ఫిదా!

Big Stories

Advertisement
×