Singeetham Srinivas Rao Family: దర్శకుడిగా.. ‘నీతి నిజాయితీ’ అనే సినిమాతో మొదలైన సింగీతం శ్రీనివాసరావు సినిమా ప్రయాణంలో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన చేసింది 60 చిత్రాలే అయినా.. అందులో ప్రతీదీ ఒక ఆణిముత్యమే. కాలానికి ఎదురొడ్డి ఎన్నో భిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే సింగీతం శ్రీనివాస్ రావు గురించి చెప్పాలంటే ఆయన సినిమాలే అందరికీ గుర్తొస్తాయి. కానీ ఆయన ఫ్యామిలీ దాదాపు గోప్యంగానే ఉంచబడింది. మరి ఆయన భార్య ఎవరు? ఆయనకు పిల్లలు ఎంతమంది ? వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే విషయాలు మాత్రం ఎప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.
సింగీతం శ్రీనివాసరావు తన వ్యక్తిగత జీవిత ప్రొఫైల్ ని తక్కువగా మెయింటైన్ చేశారనే కామెంట్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఒక గొప్ప దర్శకుడిగా , రచయితగా మంచి పేరు సొంతం చేసుకున్న సింగీతం శ్రీనివాసరావు.. 94 సంవత్సరాల వయసులో వయోభారంతో అక్టోబర్ 3వ తేదీన శనివారం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సింగీతం శ్రీనివాస్ రావు 1960లో లక్ష్మీ కల్యాణిని వివాహం చేసుకున్నారు.స్క్రిప్ట్ రచనలో తోడ్పడుతూ.. ఆయన సినీ కెరియర్లో ఆమె ఎంతో కీలకపాత్ర పోషించారు. అలాంటి ఈమె శ్రీ కల్యాణీయం అనే పుస్తకాన్ని కూడా 2012లో రాశారు. అంతేకాదు పిల్ల జమిందార్ చిత్రానికి సృజనాత్మక భాగస్వామి, సహ రచయిత్రిగా కూడా పనిచేశారు. అలాంటి ఈమె కొంతకాలం అనారోగ్యంతో బాధపడి 2022 మే 28న తుదిశ్వాస విడిచారు.
ఇకపోతే సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీ కళ్యాణి దంపతుల పిల్లల విషయానికి వస్తే.. వీరికి ఒక కుమార్తె, కుమారుడు జన్మించారు. అయితే కుమారుడు 39 సంవత్సరాలు వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరికి సుధా కార్తీక్ అనే అమ్మాయి కూడా ఉంది . ఈమె తన తల్లి రాసిన శ్రీ కళ్యాణీయం అనే పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని ఈమె కుమారుడు సింగీతం శ్రీనివాసరావు మనవడు అభినవ్ ఈ – బుక్ వెర్షన్ ను ఆన్లైన్లో ఆవిష్కరించారు. ఇకపోతే ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా తన మనవడికి సింగీతం శ్రీనివాసరావు 2021 నవంబర్ 16న అధికారికంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక ఎమోషనల్ పోస్టు కూడా పంచుకున్నారు.
also read: దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!
ఒక గర్వపడే తండ్రిగా నా భార్య సింగీతం లక్ష్మీ కళ్యాణి తెలుగులో రచించిన శ్రీ కళ్యాణీయం గ్రంధాన్ని ఆంగ్లంలోకి అనువదించి, ఆవిష్కరించిన నా కుమార్తె సుధా కార్తీక్ కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఆన్లైన్ వెర్షన్లో ఆవిష్కరించిన నా మనవడు అభినవ్ కి నా శుభాకాంక్షలు అంటూ సింగీతం శ్రీనివాసరావు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.