E-Paper
Advertisement

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!
Advertisement

Divi Vadthya:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటి దివి వద్యా.. తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ప్రేమ, సినీ ప్రయాణం గురించి ఎన్నో సందర్భాల్లో ఓపెన్‌గా మాట్లాడారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో తనకున్న భయాలు, అభిప్రాయాలను ఓ టాక్‌ షోలో ఆమె వెల్లడించారు. వివాహ బంధంపై తనకు అంతగా నమ్మకం లేకపోవడానికి తన చుట్టూ ఉన్న పరిణామాలే కారణమని తెలిపారు.

తన స్నేహితుల్లో దాదాపు 90 శాతం మంది పెళ్లైన కొద్దికాలానికే మనస్పర్థల కారణంగా విడిపోయారని దివి చెప్పారు. వారిని చూసిన తర్వాత వివాహ వ్యవస్థపై తనలో భయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి సంతోషంగా ఉండలేని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయే కంటే.. పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడం మంచిదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

ప్రేమ విఫలమైన అనుభవం :

Advertisement

దివి జీవితంలోనూ ఓ ప్రేమకథ ఉందట. గతంలో ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి అంగీకరించాయని ఆమె తెలిపారు. అయితే కొన్ని కుటుంబ పరిస్థితులు, కెరీర్‌కు సంబంధించిన ఒత్తిళ్ల కారణంగా ఆ బంధం ముందుకు సాగలేదని వెల్లడించారు. ఆ అనుభవం కూడా పెళ్లిపై తన ఆలోచనలను ప్రభావితం చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.

బిగ్‌బాస్‌తో మారిపోయిన కెరీర్:

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొనడం దివి కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. హౌస్‌లో ఎక్కువ కాలం కొనసాగకపోయినా.. తన గ్లామర్, వ్యక్తిత్వం, హుందాతనంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు భారీగా ఫాలోయింగ్ పెరిగింది.

Advertisement

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే వేదికపై మెగాస్టార్ చిరంజీవి దివి నటనను ప్రశంసించడంతో పాటు తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ఆమెకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత దివికి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోల్లో వరుస అవకాశాలు వచ్చాయి.

also read:‘పుష్పక విమానం’ వెనుక సింగీతం అసలైన ఛాలెంజ్?

ఎన్నో రిజెక్షన్లు ఎదుర్కొన్న దివి :

సినిమాల్లోకి రాకముందు దివి ఎంటెక్‌లో గోల్డ్ మెడలిస్ట్. చదువులో మంచి ప్రతిభ ఉన్నప్పటికీ.. నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు. అయితే ప్రారంభంలో ఆమెకు అవకాశాలు అంత సులభంగా రాలేదు. ఎన్నో ఆడిషన్స్‌కు హాజరై, సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగినా పలుమార్లు తిరస్కరణలు ఎదురయ్యాయని ఆమె తెలిపారు.

తన ఎత్తు, లుక్స్‌పై కూడా కొందరు విమర్శలు చేశారని, హీరోయిన్‌గా సరిపోనంటూ కామెంట్స్ ఎదుర్కొన్నానని దివి వెల్లడించారు. పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ మొదట్లో చిన్న పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తూ ‘రుద్రాంగి’, ‘పుష్ప-2’ వంటి చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు. పట్టుదలతో ముందుకు సాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

Big Stories

Advertisement
×