Shahid Afridi On Hasan Nawaz: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ ( Asian Games 2026 Tournament Finals) సందర్భంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs India, Gold Medal Match) మధ్య ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో హసన్ నవాజ్ 96 పరుగులతో ఇరగదీశాడు. అయితే చివరి వరకు పోరాడిన హసన్ నవాజ్.. ఇతరుల సపోర్ట్ లేకపోవడంతో చేతులెత్తేశాడు. లేకపోతే మ్యాచ్ గెలిపించేవాడు. అలాంటి హసన్ నవాజ్ పై షాహిద్ అఫ్రిది ( Shahid Afridi On Hasan Nawaz) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు ఇలాంటి తరహాలో ఆడిన దాఖలాలు లేవని పరువు తీశారు. అసలు నవాజ్ సంక నాకిన కూడా పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు పనికిరారని బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ లాంటి వాళ్ళను ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అసలు హసన్ నవాజ్ లాగా పోరాడడం నేర్చుకోవాలని చురకలు అంటించారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా పై హసన్ నవాజ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. అయితే హసన్ నవాజ్ ను పొగుడుతూ… పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లను బండ బూతులు తిట్టారు షాహిద్ అఫ్రిది. ఇప్పటివరకు టీమిండియా చేతిలో పాకిస్తాన్ చాలా మ్యాచులు ఓడిపోయిందని గుర్తు చేశారు. వీటిలో టీమిండియా కు కనీస పోటీ కూడా పాకిస్తాన్ ఇవ్వలేకపోయిందని ఫైర్ అయ్యారు. కానీ ఏషియన్ గేమ్స్ ఫైనల్స్ సందర్భంగా పాకిస్తాన్ యంగ్ టీం గట్టి పోటీ ఇచ్చిందని ప్రశంసించారు.
అందరి వికెట్లు పడినా కూడా హసన్ నవాజ్ మాత్రం ఇరగదీసాడని వివరించారు. అలాంటి ఆటను మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. హసన్ నవాజ్ లాగా సీనియర్ క్రికెటర్లు ఎందుకు ఆడలేక పోతున్నారని నిలదీశారు. సోషల్ మీడియాలో మేమే తోపులమని కొంత మంది పాకిస్తాన్ క్రికెటర్లు డబ్బా కొట్టుకు తిరుగుతున్నారని ఆగ్రహించారు. సోషల్ మీడియాలో చేసిన ప్రచారానికి తగ్గట్టుగా, వీళ్ళ ఆట ఎందుకు లేదని ప్రశ్నించారు. హసన్ నవాజ్ కాలిగోటికి కూడా ఈ పాకిస్తాన్ సీనియర్లు పనికి రాబోరని పరువు తీశారు.
హసన్ నవాజ్ లాంటి వాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎందుకు తయారు చేయడం లేదని షాహిద్ అఫ్రిది ప్రశ్నించారు. పాకిస్తాన్ దేశంలో చాలా మంది టాలెంట్ ఉన్న క్రికెటర్లు ఉన్నారు… అలాంటి వాళ్లను వెతికండి అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలకు చురకలు అంటించారు. అలా వెతికితే హసన్ నవాజ్ లాంటి వాళ్ళు చాలామంది దొరుకుతారని తెలిపారు.