E-Paper
Advertisement

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా
Advertisement

America: అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రానికి చెందినవారు మృత్యువాత పడుతున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. తాజాగా ముస్సోరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మ‌హిళ మృతి చెందారు. మృతిరాలి సొంతూరు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం.

అమెరికాలోని ముస్సోరిలో ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ మహిళ మృతి చెందింది. మృతురాలి సొంతూరు మహబూబాబాద్ జిల్లాకు చెందిన మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ. ఆమె వయస్సు దాదాపు 31 ఏళ్లు. ఉద్యోగ నిమిత్తం ముస్సోరీలో నివాసం ఉంటున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుప్రియ కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది.

తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

Advertisement

ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయాలు అయ్యాయి. అక్కడికక్కడే సుప్రియ మృతి చెందారు. సుప్రియ కారులో మరో భారతీయుడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దారం సుప్రియ రోడ్డు ప్రమాదం విషయం తెలియగానే మహబూబాబాద్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలియగానే కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ALSO READ: 100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

Advertisement

సుప్రియ భర్త కొడుమూరి రంజిత్, అత్తమామలు వెంకటేశ్వర్లు-రాధిక మహబూబాబాద్ పట్టణంలోని వీరభద్ర అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగం నిమిత్తం సుప్రియ ముస్సోరిలో ఉంటోంది. ముస్సోరిలో జరిగిన ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related News

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

భూపాలపల్లి ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం

ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు.. ఈసారి ప్రత్యేకం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×