E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?
Advertisement

Bigg Boss 10 Srishti: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజుకో ట్విస్ట్ తో ఆడియన్స్ కు విపరీతమైన ఆసక్తిని కలిగిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు వారాలు పూర్తి కావడంతో నాలుగవ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే వార్తలు రాగా.. సృష్టి వ్యాకరణం (Sristhi Vyakaranam) ఎలిమినేట్ అయ్యారు. టాస్క్ లలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఈమె.. మూడవ వారం సుధీర్ తో జరిగిన గొడవ కారణంగా విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. ఈ కారణంగానే ఈమె ఎలిమినేట్ అయింది అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 లో కామనర్ గా అడుగుపెట్టి , అక్కడ జడ్జెస్ ను మెప్పించి, హౌస్ లోకి వచ్చిన ఈమె చివరికి ప్రేక్షకుల ఓటింగ్ లో వెనుక పడడంతో హౌస్ ను వీడాల్సి వచ్చింది.

4వ వారం సృష్టి ఎలిమినేటెడ్..

నిజానికి సృష్టి రెండవ వారమే ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఆడియన్స్ ఈమెకు ఒక అవకాశం కల్పించడంతో ఈమె స్థానంలో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. సుధీర్ తో గొడవ కారణంగా ఫిమేల్ సింపతి తో మూడవ వారం కాస్త సేఫ్ అయిన ఈమె.. అదే గొడవ కారణంగా నాలుగవ వారం ఎలిమినేట్ అయ్యింది. నిజానికి నాలుగో వారం నామినేషన్ లో 9 మంది కంటెస్టెంట్లు నిలిచారు.

Advertisement

మొదట సృష్టి, ఆ తర్వాత దేబ్ జానీ , అమన్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు చర్చ జరిగింది. కానీ చివరికి సృష్టికే తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్లో కేవలం టాస్కుల్లో ఆడడం మాత్రమే కాకుండా.. ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం కూడా చాలా కీలకం. సృష్టి విషయంలో అదే మైనస్ గా మారిందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది.

నాలుగు వారాలలో సంపాదించింది ఎంతంటే?

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే కామనర్స్ కి 50 వేల నుండి 75 వేల వరకు వారానికి రెమ్యూనరేషన్ లభిస్తుంది. అయితే సీజన్ 10 లోకి అడుగు పెట్టినప్పుడు వారానికి 75 వేల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక నాలుగు వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను సుమారుగా 3 లక్షల రూపాయలు ఈమెకు రెమ్యూనరేషన్ లభించినట్లు సమాచారం.

Advertisement

దీనికి ముందు అగ్ని పరీక్షలో పాల్గొన్నందుకు సుమారుగా 50వేలు అందుకున్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. అంటే అగ్నిపరీక్షతోపాటు బిగ్ బాస్ జర్నీని కలిపితే సృష్టి మొత్తం సుమారుగా 3.5 లక్షలు సంపాదించినట్లు సమాచారం. ఏది ఏమైనా టాస్క్ లో పర్ఫామెన్స్ కనబరిచి, ఆడియన్స్ హృదయాలను దోచుకోవడంలో విఫలమైన సృష్టి.. ఎట్టకేలకు నాలుగవ వారం ఎలిమినేట్ అయింది.

 

ALSO READ: చుట్టమల్లే వివాదంపై సెలబ్రిటీలను తప్పుబట్టిన వర్మ.. అసలేం జరిగిందంటే?

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×