BigTV English

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

India’s Biggest Director:ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓటమి అంటే ఏంటో ఎరుగని దర్శకుల జాబితా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీరంతా సినిమా రంగంలో తమ ఆసక్తిని కనబరుస్తూనే.. ఆడియన్స్ లో తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇటు టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ప్రత్యేకించి కొంతమంది దర్శకులు తమ తమ సినిమా ఇండస్ట్రీ స్థాయిని కూడా అమాంతం పెంచేశారు. అలా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. తమ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని కూడా ఎల్లలు దాటించి రికార్డులు సృష్టిస్తున్న ఆ డైరెక్టర్లు ఎవరు? ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశారు? ఆ సినిమాల ఫలితాలు ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..


ఎస్.ఎస్.రాజమౌళి – టాలీవుడ్

ఓటమెరుగని దర్శకుడిగా ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న డైరెక్టర్స్ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు రాజమౌళి (SS Rajamouli). ‘శాంతినివాసం’ అనే సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్గా మొదలైన ఆయన సినీ ప్రయాణం.. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, సై , మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్.. ఇలా మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలలో.. ప్రతి ఒక్కటి కూడా వేటికవే ప్రత్యేకమైన గుర్తింపును, విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రాలతో సక్సెస్ రేట్ పెంచుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి సంచలనం సృష్టించారు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబు (Maheshbabu) తో ‘ఎస్ఎస్ఎంబి 29’ అనే వర్కింగ్ టైటిల్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా తెరకెక్కిస్తున్నారు.


అనిల్ రావిపూడి – టాలీవుడ్

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో అంత పేరు సొంతం చేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈయన కూడా ఫ్లాప్ ఎరుగని డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు. సినీ రచయితగా కెరియర్ మొదలుపెట్టి ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం ఇలా మొత్తంగా 8 చిత్రాలు చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) తో ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.

రాజ్ కుమార్ హిరానీ – బాలీవుడ్

ఇటు టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా ఓటమెరుగని దర్శకులు ఉన్నారు. బాలీవుడ్ సినిమా పరిశ్రమ దృష్టిని ఆకర్షించేలా చేసిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Raj Kumar Hirani). తన అద్భుతమైన డైరెక్షన్ మెలుకువలతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. ఫిలిం ఎడిటర్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈయన ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, ఫెరారీకి సవారీ, పీకే, సంజు, డంకీ ఇలా మొత్తంగా 7 చిత్రాలకు దర్శకత్వం వహించి, అన్నింటితో కూడా భారీ సక్సెస్ అందుకొని ఫ్లాప్ ఎరుగని డైరెక్టర్ గా నిలిచారు.

లోకేష్ కనగరాజ్ – కోలీవుడ్

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). 2017లో విడుదలైన ‘మానగరం’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఖైతీ , మాస్టర్, విక్రమ్ ఇలా ఇప్పటివరకూ 4 చిత్రాలకు దర్శకత్వం వహించి, దర్శకుడిగా సత్తా చాటారు. ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) హీరోగా ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతోంది.

అట్లీ అరుణ్ కుమార్ – కోలీవుడ్

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్లాప్ ఎరుగని మరో డైరెక్టర్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు అట్లీ అరుణ్ కుమార్ (Atlee Arun Kumar) . అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన ‘రాజారాణి’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దీని తర్వాత తేరి, మెర్సల్, బిగిల్, జవాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తం 5 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) తో ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్ తో హాలీవుడ్ రేంజ్ లో సినిమా చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ – శాండిల్ వుడ్

కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిన డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు ప్రశాంత్ నీల్(Prashanth Neel) . 2014లో వచ్చిన ‘ఉగ్రం’ సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. ఆ తర్వాత శ్రీమురళిని, కే జి ఎఫ్ చాప్టర్ 1, 2 సలార్ ఇలా మొత్తం 4 చిత్రాలు చేసి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు.

ALSO READ:Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Related News

Chiranjeevi: బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వెనుక ఆయన హస్తం ఉంది -చిరంజీవి

Mrunal Thakur: సినిమాల ఫెయిల్యూర్ కు అదే ప్రధాన కారణం.. ఫైర్ అయిన మృణాల్!

War 2 Tickets: వార్ 2 టికెట్స్‌.. హిందీ-తెలుగు వెర్షన్ల మధ్య ఇంత తేడానా? తెలుగు వారిన దోచేస్తున్న నిర్మాతలు

Jr.NTR: ఆ ఒక్క కారణంతోనే వార్ 2 చేశా… అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్!

Lokesh Kanagaraj: నా దృష్టిలో రజనీకాంత్, కమల్ హాసన్ కంటే అతనే స్టార్ హీరో

Suman: పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న హీరో సుమన్.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే!

Big Stories

×