OTT Movie : మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వేస్టిగేషన్, యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఒక మూవీ ఈ ఏడాది థియేటర్లలో విడుదలైంది. జనవరిలో మలయాళం, తెలుగులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించి , ఓటీటీలో కూడా దుమ్ము దులుపుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జీ 5 (Zee 5) లో
ఈ మలయాళం క్రైమ్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ఐడెంటిటీ’ (Identity). 2025 లో వచ్చిన ఈ సినిమాకి అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో టోవినో థామస్ (హరన్ శంకర్), త్రిష కృష్ణన్ (అలీషా), వినయ్ రాయ్ (అలెన్ జాకబ్), మందిరా బేడీ ప్రధాన పాత్రల్లో నటించారు. జేక్స్ బిజోయ్ దీనికి సంగీతం సమకూర్చారు. 2025 జనవరి 2 న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇది 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి IMDB లో 7.3/10 రేటింగ్ ఉంది.
జీ 5 (Zee 5) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
హరన్ శంకర్ కొచ్చిలో తన ఇద్దరు సిస్టర్స్ తో నివశిస్తుంటాడు. అతని బాల్యంలో, తండ్రి వల్ల అతనికి ఒబ్సెసివ్-కంపల్సివ్ పర్సనాలిటీ డిసార్డర్ (OCPD) వస్తుంది. అతని తల్లి ఒక పోలీసు స్కెచ్ ఆర్టిస్ట్. ఆమె నుండి అతను స్కెచింగ్ నైపుణ్యాన్ని నేర్చుకుని ఉంటాడు. హరన్ ఒక మాజీ NSG కమాండో, ప్రస్తుతం స్కై మార్షల్‌గా పనిచేస్తుంటాడు. కానీ ఈ విషయం రహస్యంగా ఉంచుతాడు. అతని అపార్ట్‌మెంట్‌లోకి కర్ణాటక పోలీసు సీఐ అలెన్ జాకబ్, ఒక హత్య కేసు సాక్షి అలీషా అబ్దుల్ సమద్ (త్రిష కృష్ణన్) అనే జర్నలిస్ట్ వస్తారు. అలీషా ఒక హత్యను చూసిన తర్వాత ఒక ప్రమాదంలో చిక్కుకుంది. దీనివల్ల ఆమెకు ప్రోసోపాగ్నోసియా (ముఖాలను గుర్తించలేని వ్యాధి) వస్తుంది. కానీ ఆమె ఈడెటిక్ మెమరీ వల్ల హంతకుడి శరీర గుర్తులను గుర్తుంచుకుంది. ఆమె చెప్పే గుర్తులతో హరన్ హంతకుడి బొమ్మను గీయడానికి ప్రయత్నిస్తాడు.
కథ మొదట అమర్ ఫెలిక్స్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక దుస్తుల దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తూ, మహిళల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసి, వాళ్ళను బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. అమర్ తన గతంలో హరన్ సోదరి నీర్జా, ఆమె స్నేహితురాలు సకీనాపై అఘాయిత్యం చేసాడు. ఈ విషయం తెలుసుకున్న హరన్, అమర్‌ను చంపి, అతని షాప్ ను తగలబెడతాడు. అలీషా, అమర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఫైర్‌లో చిక్కుకుని ఈ ప్రమాదంలో ప్రోసోపాగ్నోసియాకు గురవుతుంది. పోలీసులు అమర్ హత్య కేసులో హరన్‌పై అనుమానం వ్యక్తం చేస్తారు. కానీ అమీర్ అలీ అనే వ్యక్తి ఈ నేరం ఒప్పుకోవడంతో హరన్ తప్పించుకుంటాడు. ఆతరువాత స్టోరీ జాకబ్ వైపు మల్లుతుంది. ఇతను పైకి మంచిగా కనిపిస్తూ, కరప్షన్ తో అక్రమం గా డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ కేసుతో పాటు అతనికి చాలా కేసుల్లో సంబంధం ఉంటుంది. ఆ తరువాత స్టోరీ రసవత్తరంగా నడుస్తుంది. చివరికి జాకబ్ కి, అమర్ హత్యకి ఉన్న లింకు ఏంటి ? అమర్ ని ఎవరు చంపారు ? అలీషా హంతకుణ్ణి గుర్తుపడుతుందా ? జాకబ్ నేర చరిత్ర ఏమిటి ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : కొత్త కోడలు అడుగు పెట్టినప్పటి నుంచి అపశకునాలే… ట్విస్టులతో అదరగొట్టే కన్నడ మిస్టరీ థ్రిల్లర్