Madharaasi : తమిళ స్టార్ హీరోస్ లో శివ కార్తికేయన్ ఒకరు. కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా శివ కార్తికేయన్ చాలామంది ఫేవరెట్ హీరో. తను తమిళ్లో చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ వచ్చాయి. ఇక్కడ కూడా తనకంటూ ఒక మార్కెట్ ఉంది. అలానే కొంత ఫ్యాన్ బేస్ కూడా ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మదారాసి అనే సినిమాను చేస్తున్నాడు శివ కార్తికేయన్. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం అనిరుద్ ఫామ్ మామూలుగా లేదు. ప్రతి సినిమాకి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇస్తూ సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆ స్థాయిలోనే సాంగ్స్ ఇవ్వబోతున్నాడు.
ప్రోమో అదిరింది
తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక సాంగ్ అనౌన్స్మెంట్ ను చాలా డిఫరెంట్ గా చేస్తారు. ఇది కేవలం ఇప్పటినుంచి వస్తున్న ఆనవాయితీ కాదు. ఎప్పటినుంచో సాంగ్స్ ను డిఫరెంట్ గా అనౌన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా నెల్సన్ దిలీప్ కుమార్, శివ కార్తికేయన్, అనిరుద్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పాట అనౌన్స్మెంట్ ఇచ్చే వీడియోలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా నెల్సన్ దిలీప్ కుమార్ లేరు, కానీ ఈ వీడియోలో మాత్రం ఏ ఆర్ మురగదాస్, శివ కార్తికేయన్, అనిరుద్ కలిసి మరో క్రేజీ వీడియో చేశారు.
రెండు రోజుల నుంచి వెయిటింగ్
ఏ ఆర్ మురుగదాస్ అనిరుద్ మ్యూజిక్ స్టూడియోలో దోమలు కొట్టుకుంటూ ఉంటాడు. ఆ తరుణంలో అక్కడికి వచ్చిన శివ కార్తికేయన్ విషయాన్ని కనుక్కుంటాడు. అక్కడి నుంచి మొదలైన వాళ్ల సంభాషణ చాలా ఫన్నీగా ఉంటుంది. మొత్తానికి రెండు రోజుల్లో సాంగ్ అనౌన్స్మెంట్ చేసేసాము ఖచ్చితంగా నువ్వు పాట ఇవ్వాల్సిందే అని అనిరుద్ నుంచి వాళ్ళిద్దరూ తప్పించుకుని వెళ్ళిపోతారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. వీడియో చివర్లో పాటను కూడా విడిచిపెట్టారు. పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ ఏ స్థాయిలో ఉండబోతుందో అని అందరికీ ఒక క్యూరియాసిటీ మొదలైంది.