E-Paper
Advertisement

Producer SKN: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నిర్మాత ఎస్కేఎన్… వారి పై ఫిర్యాదులు!

Producer SKN:  సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నిర్మాత ఎస్కేఎన్… వారి పై ఫిర్యాదులు!
Advertisement

Producer SKN: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మతగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ (SKN)ఒకరు. పలు సినిమాలకు నిర్మాతగా కొనసాగుతున్న ఈయన తన సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సినిమాల పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిత్యం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలు గురించి అభిమానులతో పంచుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రతి సినిమా ఈవెంట్ లోనూ ఎస్కేఎన్ పాల్గొంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఈయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ఫిర్యాదులు…

ఇకపోతే ఇటీవల ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజా సాబ్ సినిమా విడుదలకు ముందు ఈయన సినిమా పట్ల పెద్ద ఎత్తున గొప్పలు చెబుతూ ప్రమోషన్లు నిర్వహించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోని నేపథ్యంలో ఎస్కేఎన్ ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. దీంతో ఈయన తనపై విమర్శలు చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా ది రాజా సాబ్ సినిమా విషయంలో తనపై భారీగా విమర్శలు వస్తున్నట్లు తెలియజేశారు.

సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన నిర్మాత..

Advertisement

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఈయనని విమర్శించారో వారి పట్ల సైబర్ క్రైమ్ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పాలి. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాలి అంటే ఎస్కేఎన్ స్పందించి మరింత వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలను కొంతమంది చూసి చూడనట్టు వదిలేయగా మరి కొందరు మాత్రం ఈ విమర్శలపై కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.

మాస్ మూవీ మేకర్స్..

Advertisement

తాజాగా ఎస్కేఎన్ సైతం తనపై జరుగుతున్న ట్రోల్లింగ్ పట్ల సైబర్ క్రైమ్ ను ఆశ్రయించారు.. ఇక ఈయన సినిమా కెరియర్ విషయానికి వస్తే .. ఈయన మాస్ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తన నిర్మాణ సంస్థలో ఎస్కేఎన్ టాక్సీవాలా, రొమాన్స్,మంచీ రోజులుచాయే, 3 రోజెస్, బేబీ వంటి సినిమాలను నిర్మించి నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈయన నిర్మాతగా కంటే ముందుగా ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే వంటి సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఈయన నిర్మాణంలో మరికొన్ని సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో బిజీగా మారిన ఎస్కేఎన్ పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఈయన సైబర్ క్రైమ్ ను ఆశ్రయించారు.

Also Read: Raakaasaa Glimpse: భయపెట్టేస్తున్న సంగీత్ శోభన్ రాకాసా గ్లింప్స్..

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×