Snigdha:టాలీవుడ్ నటి స్నిగ్ధ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.ముఖ్యంగా ఇండస్ట్రీలో అవకాశాలు, నాని, నాగశౌర్యతో తనకున్న ఫ్రెండ్ షిప్ గురించి అలాగే నానిని తాను బావ అని ఎందుకు పిలుస్తాననే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు.ఇక ఈ క్రమంలోనే సినిమాల్లో తనకు ఎందుకు ఎక్కువ అవకాశాలు రావడం లేదనే ప్రశ్నకు కూడా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు స్నిగ్ధ.
స్నిగ్ధకు ‘అలా మొదలైంది’ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చిందన్న సంగతి తెల్సిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్నిగ్ధ చేసిన పాత్ర ఆడియన్స్ కి బాగా గుర్తుండిపోయింది.ఇక ఆ సినిమా వల్లే తనకు మంచి గుర్తింపు వచ్చిందని మరోసారి గుర్తుచేస్తుకున్నారు స్నిగ్ధ .ముఖ్యంగా నాని, దాము వంటి వాళ్ల వల్లనే కూడా తనకు మంచి పాత్రలు చేసే అవకాశం వచ్చిందని తెలిపారు.
ఇక ఇప్పటివరకు తాను కేవలం 40 నుంచి 43 సినిమాల వరకు చేశానని ధనరాజ్, వేణు, సత్య, సురేఖ వాణి వంటి వాళ్లతో పోలిస్తే తన నటన చాలా తక్కువని అన్నారు. తాను ఎక్కువగా ఫ్రెండ్ క్యారెక్టర్లే చేశానని చెప్పారు. బయటకు వెళ్లినప్పుడు అభిమానులు తనను గుర్తుపట్టి సెల్ఫీలు దిగుతున్నారని, మరిన్ని సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు.
అయితే సినిమాల్లో అవకాశాలు రావాలంటే నటన ఒక్కటే సరిపోదని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు స్నిగ్ధ.ఒక పాత్రకు ఎవరు సరిపోతారో రచయిత, దర్శకుడు డిసైడ్ చేస్తారని మరి తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదో దర్శకులనే అడగాలని స్పష్టం చేశారు.ఇక ప్రస్తుతం సినిమాల్లో పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే విధానం మారిపోయిందని, వచ్చిన అవకాశాలను బట్టి నటీనటులు ముందుకు వెళ్లాల్సి ఉంటుందని వివరించారు.
ఇక ఇండస్ట్రీలో పరిచయాలు ఉంటేనే అవకాశాలు వస్తాయా అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు స్నిగ్ధ. తనకు పర్సనల్ ఫ్రెండ్ షిప్ ,సినిమా పనులు రెండు వేరు వేరు అని క్లారిటీ ఇచ్చారు.
నాని, మనోజ్ వంటి వారితో కలిసినప్పుడు సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటామని,వాళ్లు చేస్తున్న సినిమాల్లో తనకు పాత్ర ఇవ్వాలని ఎప్పుడూ అడగనని కుండ బద్దలు కొట్టేశారు.
ఇక నానిని బావ అని ఎందుకు పిలుస్తారనే విషయం గురించి మాట్లాడుతూ, తాను మొదట నానిని బావ అని పిలవడం మొదలుపెట్టానని,తమ మధ్య మొదలైన ఫ్రెండ్ షిప్ అలా పిలిచేంత చనువు తెచ్చిపెట్టిందని సరదాగా చెప్పుకొచ్చారు ఇక తన తర్వాత అందరూ అలాగే పిలవడం అలవాటు చేసుకున్నారని తెలిపారు.అయితే నానితో అస్తమానం కలవకపోయినా, చాలాకాలం తర్వాత కలిసినా నిన్ననే కలిసినట్లు అనిపిస్తుందని చెప్పారు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని వివరించారు.
ఇక నాగశౌర్యతో తనకున్న స్నేహం గురించి మాట్లాడుతూ ఏదైనా విషయం చెప్పాలనిపిస్తే ఒక్క మెసేజ్ పెడితే చాలని, అవసరమైనప్పుడు ఆయన ఎక్కడ ఉన్నా తనతో మాట్లాడతారని తెలిపారు. రోజూ మాట్లాడుకోకపోయినా తమ స్నేహం అలాగే ఉంటుందని చెప్పారు.
ఇండస్ట్రీలో తరచూ కలిసి తిరిగే వాళ్లు దర్శకులకు ఎక్కువగా గుర్తుంటారని స్నిగ్ధ అభిప్రాయపడ్డారు. సినిమా తీసే సమయంలో దర్శకులకు ఎన్నో విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుందని, అప్పుడు ఇటీవల కలిసిన వాళ్ల ముఖాలు త్వరగా గుర్తుకు రావచ్చని చెప్పారు. అందుకే తరచూ పరిచయంలో ఉండేవాళ్లకు కొన్ని సందర్భాల్లో అవకాశాలు రావచ్చని వివరించారు. అయితే అలా అవకాశాలు పొందేవాళ్లను తాను తప్పుపట్టనని స్పష్టం చేశారు.
తనకు నటిగా మాత్రమే కాకుండా, ఒక మనిషిగా కూడా ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు వచ్చిందని స్నిగ్ధ చెప్పారు. తాను పాడే పాటలు, టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో మాట్లాడే విధానం కూడా ప్రేక్షకులకు దగ్గర చేశాయని తెలిపారు. తనను మరిన్ని సినిమాల్లో చూడాలని అభిమానులు కోరుకోవడం సంతోషంగా ఉందన్నారు.
మొత్తానికి, సినిమాల్లో అవకాశాలు, ఇండస్ట్రీలో పరిచయాలు, నాని బావతో స్నేహం, నాగశౌర్యతో అనుబంధం గురించి స్నిగ్ధ చెప్పిన విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ALSO READ :నితిన్ భార్యగా చేస్తున్న రుక్మిణి ఎవరో తెలుసా?