Sirimanu Festival: విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో వెలిసిన సిరిమాను, ఇరుసుమాను చెట్లకు సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. అమ్మవారి ప్రతి రూపానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం చెట్లను కొట్టి సిరిమాను, ఇరుసుమాను తయారీ కోసం వాటిని హుకుంపేటలోని పూజారి ఇంటికి భారీ బందోబస్తుతో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఖ్యాకంగా తరలి వచ్చే భక్తులకు అనుగుణంగా ఉత్సావానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
అమ్మవారి ఆలయాన్ని వివిధ కళాకృతులతో సుందరంగా అలంకరించారు. ఆలయ విస్తరణ తర్వాత జరుగుతోన్న మొదటి పండగ కావడంతో విశాలమైన ప్రాంగణంలో భక్తుల దర్శనాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి పండగను సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తోన్నట్లు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు,ఎం.ఎల్.సి. గాదె శ్రీనివాసులు నాయుడు,బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మతో పాటు పలువురు కూటమి నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Also read: కోలుకున్న భారత రూపాయి విలువ.. ఆర్‌బీఐ సంచలన నిర్ణయం?