Bengaluru–Shivamogga Vande Bharat: దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైల్వే సేవలను విస్తరిస్తోంది భారతీయ రైల్వే. అందులో భాగంగానే హైదరాబాద్ మీదుగా మరో వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతోంది. బెంగళూరు–శివమొగ్గ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించబోతోంది. ఈ రైలు ద్వారా రెండు నగరాల మధ్య ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
త్వరలో వందేభారత్ వస్తోందంటూ ఎంపీ మోహన్ ట్వీట్
బెంగళూరు- శివమొగ్గ మధ్య త్వరలో వందేభారత్ రైలు అందుబాటులోకి రాబోతోందంటూ బెంగళూరు సెంట్రల్ ఎంపీ పిసి మోహన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రారంభ తేదీ, టైమ్ టేబుల్ ఇంకా ఖరారు కాలేదు. కానీ, ఈ కొత్త సర్వీసు కోసం బెంగళూరు నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివమొగ్గ వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభించిన తర్వాత, అక్కడి ప్రజలు శివమొగ్గ నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు నడిపించాలని కోరారు. చాలా కాలంగా ఆ ప్రాంత ప్రజలు ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు వారి కోరిక నెరవేరబోతోంది. కొత్త వందే భారత్ సర్వీస్ విమానాశ్రయంతో కనెక్ట్ అవుతూ ప్రయాణించనుంది. రెండు ప్రాంతాల మధ్య మెరుగైన ప్రయాణ సేవలను అందించనుంది.
Shivamogga-Bengaluru Vande Bharat soon. pic.twitter.com/ug4fZXhSok
— P C Mohan (@PCMohanMP) July 10, 2025
కర్నాటకలో 12వ వందేభారత రూట్
బెంగళూరు- శివమొగ్గ వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే, కర్నాటకలో నడిచే 12వ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అవుతుంది. ఈ రైలు కన్నడ రాష్ట్రంలో ప్రీమియం రైల్వే నెట్ వర్క్ ను మరింత విస్తరించనుంది. అదనంగా, బెంగళూరును మైసూరు, చెన్నై, ఎర్నాకులం, హైదరాబాద్, ధార్వాడ్, కోయంబత్తూర్, బెలగావి లాంటి ఏడు ప్రధాన నగరాలను అనుసంధానిస్తుంది. ఆధునిక సౌకర్యాలతో ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచుతూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
Read Also: ఆమె మెట్రో రైలు ప్రమాదంలో చనిపోయింది.. కానీ, ఆమె ఫోన్ నుంచి కొడుకు, చెల్లికి కాల్స్.. అదెలా?
మేలో బెంగళూరు-బెలగావి వందేభార్ ప్రారంభం
ఈ సంవత్సరం మేలో బెంగళూరు-బెలగావి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. ఇది ప్రయాణీకులకు మెరుగైన రైల్వే సేవలను అందిస్తోంది. ఈ రైలు ఉదయం బెలగావి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకుంటుంది. సుమారు గంట తర్వాత తిరుగు ప్రయాణం అవుతుంది. మధ్యాహ్నం సమయంలో బెంగళూరు నుంచి బయల్దేరి రాత్రికి బెలగావి చేరుకుంటుంది. ఇప్పుడు శివమొగ్గ మార్గంలో కూడా వందేభారత్ ఎక్స్ ప్రెస్ చేరడంతో కర్ణాటక అంతటా సెమీ హైస్పీడ్ రైల్వే సేవలు మరింత మెరుగు కానున్నాయి. ప్రయాణీకులకు మెరుగైన ప్రీమియం సేవలను అందించనున్నాయి.
Read Also: బాబోయ్.. దేశంలో రోజూ ఇన్ని రైళ్లు నడుస్తాయా? అస్సలు ఊహించి ఉండరు!