Horror Series OTT : ప్రేమలో మోసం, పగ, పాత జ్ఞాపకాల చుట్టూ సాగే హారర్ సిరీస్‌లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ బేస్ ఉంటుంది. సాధారణంగా హాలీవుడ్ దెయ్యాల సిరీస్ లు చూస్తుంటాం. కానీ మిడిల్ ఈస్ట్ బ్యాక్‌డ్రాప్ లో, అరబిక్ కల్చర్ ను మిక్స్ చేస్తూ భయపెట్టేలా వచ్చిన లేటెస్ట్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ‘అబ్సెస్’ (Obsess). కువైట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ నాలుగు ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇంతకీ సిరీస్ కథ ఏంటంటే…
తలాల్ అనే వ్యక్తి తన తండ్రి మరణం తర్వాత చాలా ఏళ్లకు భార్య మోనాతో కలిసి కువైట్ కు తిరిగి వస్తాడు. అయితే అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి అతడిని గత జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా గతంలో తాను ప్రేమించిన హెస్సాతో ఉన్న రిలేషన్ కి సంబంధించిన విషయాలు మళ్లీ గుర్తుకొస్తుంటాయి. ఇదే సమయంలో అతడి తండ్రి మెంటల్ సిట్యుయేషన్ కూడా క్రమంగా దిగజారుతుంది. ఇంట్లో వింత వింత సంఘటనలు మొదలవడంతో తలాల్ కు ఏం జరుగుతుందో అర్థం కాదు.
ఒకరోజు హెస్సా సోదరి నుంచి అతడికి ఓ డైరీ అందుతుంది. అందులో ఉన్న విషయాలు చదివిన తర్వాత గతంలో జరిగిన కొన్ని భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. హెస్సాకు ఏం జరిగింది ? ఆమె జీవితంలో చోటుచేసుకున్న విషాదానికి కారణాలేంటి ? తలాల్ కుటుంబాన్ని వెంటాడుతున్న ఈ వింత సంఘటనల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? గతంతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని ఈ శాపం నుంచి బయటపడటానికి తలాల్ ఏం చేశాడనేదే మిగతా కథ.
Also Read : మామగారి రహస్య వ్యవహారం బయటపెట్టే కాబోయే కోడలు… దీపావళి రోజున అసలైన ధమాకా
ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌లో యాకూబ్ అల్‌ఫర్హాన్ (Yagoub Alfarhan), హయా అబ్దుల్ సలాం (Haya Abdel Salam), లైలా అబ్దుల్లా (Layla Abdallah) ప్రధాన పాత్రల్లో నటించారు. లెబనీస్ దర్శకుడు సయీద్ ఎల్ మరూక్ (Said El Marouk) దర్శకత్వం వహించారు. ‘అబ్సెస్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అరబిక్ ఒరిజినల్, ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం నాలుగు ఎపిసోడ్లు మాత్రమే ఉండటంతో ఒకే సిట్టింగ్‌లో పూర్తి చేయొచ్చు. ఈ సిరీస్ లోని విజువల్స్, సౌండ్ డిజైన్ హారర్ వాతావరణాన్ని బాగా క్రియేట్ చేస్తాయి. సాధారణ దెయ్యం కథల్లా కాకుండా సైకలాజికల్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌ను కలిపి చూపించారు. మిడిల్ ఈస్ట్ కల్చర్, పాతకాలపు వాతావరణం ఈ హారర్ కథకు ప్రత్యేకమైన ఫీల్ ను తీసుకొస్తాయి. అరబిక్ హారర్ సిరీస్‌లను కొత్తగా చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
Also Read : జూన్‌లో మగవాళ్లకు మృత్యుగండం… ఏడేళ్లకోసారి తిరగబెట్టే శాపం… ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ను ఇంకా చూడలేదా ?