E-Paper
Advertisement

ఎల్ నినో ఎఫెక్ట్.. మండుతున్న నిత్యావసరాల ధరలు..!

ఎల్ నినో ఎఫెక్ట్.. మండుతున్న నిత్యావసరాల ధరలు..!
Advertisement

Rising Prices: సామాన్యుడి జీవితం బతుకు భారం అవుతోంది. నిత్యావసరాలు ధరలు నిప్పులు చెరుగుతున్నాయి. కూరగాయల మార్కెట్ కి వెళ్తే ధరలు చూసి కొనాల వద్దా అన్న సందేహం కలుగుతోంది.కుటుంబానికి అవసరమైన సరుకులు కొనుగోలు చేయాలంటే జేబుకు చిల్లు పడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెరగకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

సామాన్యులకు..

ఒకప్పుడు నెలవారి ఆదాయంతో కుటుంబ అవసరాలను సర్దుబాటు చేసుకునే పరిస్థితి ఉండగా ప్రస్తుతం అత్యవసరాలకు అధిక మొత్తంగా ఇతరుల నుంచి సర్దుబాటు చేసుకుని పరిస్థితి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యవసర సరుకులపై నియంత్రణ, పర్యవేక్షణ చేపట్టి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి సామాన్యులకు అందుబాటులో ధరలు, సరుకులు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ధరల భారంతో ప్రజల వంటింటి బడ్జెట్ కుదేలు అవ్వకుండా తక్షణ ఉపశమన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ధరల పెరుగుదలకు కారణాలను గుర్తించాలని కోరుతున్నారు.

ధరల సెగ..వంటింట్లో కలవరం

Advertisement

కూరగాయలు ప్రతి కుటుంబానికి నిత్యవసరమే పప్పు, కూర ఇతర వంటకాలకు కావాల్సిన పదార్థాలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా సామాన్యుడిపై పడుతుంది. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులు ధరలు తెలుసుకొని పరిమితంగా కొనుగోలు చేయవలసి వస్తుందని చెబుతున్నారు.

ఆదాయం అంతంతే ఖర్చులు మాత్రం కొండంత

కూలీ పనులు చేసుకుని కార్మికులు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు పరిమిత ఆదాయంతో జీవనం సాగించే కుటుంబాలకు ధరల పెరుగుదల మరింత భారంగా మారుతుంది. ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులతో ఇప్పటికే సతమతమవుతున్న కుటుంబాలకు నిత్యావసరాలు అదనపు భారాన్ని మోపుతున్నాయి. ప్రస్తుతం ఎల్ నిన్ను ప్రభావంతో బియ్యం, పప్పులు,జొన్నల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ అవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: రిటైర్మెంట్‌ తీసుకున్న దొంగకు భారీ దోపిడీ ఛాన్స్‌… వంద మిలియన్ డాలర్ల ప్లాన్‌ బెడిసికొడితే… హై వోల్టేజ్‌ హీస్ట్ థ్రిల్లర్‌

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1నుండి వాటర్ ట్యాంకర్లు..?

అమిత్ షా మహా పాదయాత్రతో.. రాంచందర్ రావు కీలక ఆదేశాలు జారీ!

తెలంగాణకు అమిత్ షా రాక.. హైదరాబాద్‌ పర్యటనకు షెడ్యూల్ ఖరారు!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని స్పాట్‌లో వ్యక్తి మృతి!

రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద.. హైడ్రా సంచలన కూల్చివేతలు!

ఆరో తరగతి చదువుతున్న కూతురిపై.. సవతి తండ్రి లైంగిక దాడి!

సీఎం రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ సవాల్!

Big Stories

Advertisement
×