E-Paper
Advertisement

No Helmet No Petrol: ఇకపై నో హెల్మెట్ నో పెట్రోల్.. విశాఖ పోలీసుల కొత్త ప్లాన్

No Helmet No Petrol: ఇకపై నో హెల్మెట్ నో పెట్రోల్.. విశాఖ పోలీసుల కొత్త ప్లాన్
Advertisement

No Helmet No Petrol: ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో.. విశాఖ నగర పోలీసులు సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఇకపై నగరంలోని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకే పెట్రోల్ పోస్తున్నారు. జనవరి 1,2026 నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. పెట్రోల్ బంకుల్లో.. ‘ నో హెల్మెట్ నో పెట్రోల్’ బోర్డులు సైతం ఏర్పాటు చేశామని చెప్పారు.

రోడ్డు ప్రమాద మరణాల్లో

రోడ్డు యాక్సిడెంట్లలో ఎక్కువగా మరణిస్తున్న లేదా గాయపడిన వారికి హెల్మెట్ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. అందుకే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే 1,000 ఫైన్ విధిస్తున్నారు. 2023లో ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా మరణించారు. 2023లో రాష్ట్రంలో జరిగిన మొత్తం 8,137 రోడ్డు ప్రమాద మరణాలలో 4,139 మంది మోటార్ వాహనదారులే ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణంగా హెల్మెట్ లేకపోవడమేనని పోలీసులు అంటున్నారు.

98 శాతం నో హెల్మెట్

Advertisement

దిల్లీలోని ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇంజురీ ప్రివెన్షన్ సెంటర్ నివేదిక ప్రకారం.. ఏపీలోని పట్టణాల్లో 74% ద్విచక్ర వాహనదారులు, గ్రామీణ ప్రాంతాల్లో 78% మంది హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 98% కంటే ఎక్కువ వెనుక కూర్చొనే వారు (పిలియన్ రైడర్లు) హెల్మెట్ పెట్టుకోవడంలేదు.

విశాఖలో సంవత్సరానికి కనీసం 300 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు నో హెల్మెట్ నో పెట్రోల్ పాలసీ తీసుకొచ్చామని అంటున్నారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు

Advertisement

“మా ఉద్దేశం రోడ్డు ప్రమాదాలను నివారించడం. కొత్త ఏడాదిలో ట్రాఫిక్ యాక్సిడెంట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం” అని విశాఖ నగర పోలీస్ కమిషన్ శంఖ బత్ర బాగ్చి తెలిపారు.

“హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వెళ్తే వారికి పెట్రోల్ వేయవద్దని చెప్పాము. మాకు పెట్రోల్ బంకు సిబ్బంది సహకరిస్తున్నారు. వాళ్లు కూడా హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టడంలేదు. మేము కూడా దీనిపై స్పెషల్ డ్రైవ్ కండెక్ట్ చేస్తున్నాం”- ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ, విశాఖపట్నం

Also Read:  విశాఖ పోలీస్ వార్షిక నివేదిక.. 2025లో సంచలన విషయాలు

పెట్రోల్ బంకుల్లో బ్యానర్లు

నగరంలోని పెట్రోల్ బంకుల్లో ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని వాహనదారులకు కోరుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొన్ని పెట్రోల్ బంకుల సిబ్బంది, యజమానులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నప్పటికీ.. వాహనదారులకు పెట్రోల్ నిరాకరించలేమని చెప్పారు. హెల్మెట్లు లేకుండా వస్తున్న వారితో తాము వాదించలేమని అంటున్నారు.

Related News

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

Big Stories

Advertisement
×