Hibiscus Leaves: జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మందార పూలతో పాటు ఆకులు కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి. ఇంతకీ జుట్టు పెరుగుదలకు మందార ఆకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదల:
కెరాటిన్ సంశ్లేషణకు అవసరం అయిన అమైనో ఆమ్లాలు మందార ఆకులలో ఉంటాయి. అంతే కాకుండా ఇవి జుట్టు పలచబడే సమస్యను ఎదర్కుంటున్న వారికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో కూడా ఇవి కూడా ఉపయోగపడతాయి. మందార ఆకులను పేస్ట్ లాగా తయారు చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది:
మందార ఆకులు క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు వేర్లకు పోషణ అందించడం ద్వారా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
తలపై చర్మానికి మేలు:
మందారంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల తల చర్మంపై చుండ్రు, దురద తగ్గుతాయి. తల చర్మంపై ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు.. ఆకుల శీతలీకరణ ప్రభావం జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.
జుట్టుకు తేమ అందిస్తుంది:
మందార ఆకులు సహజ కండిషనర్ లాగా పనిచేస్తాయి. ఇవి జుట్టుకు తేమను అందించి.. నిగనిగలాడేలా చేస్తాయి. ఆకుల సహజ గుణం కారణంగా జుట్టు చిక్కుముడులను తగ్గుతాయి. అంతే కాకుండా జుట్టు అవసరం అయిన పోషణ లభిస్తుంది.
జుట్టును నల్లగా మారుస్తుంది:
మందారంలోని సహజ రంగులు జుట్టు తెల్లబడటాన్ని ఆలస్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జుట్టుకు మందార ఆకుల పేస్ట్ మీ జుట్టు యొక్క సహజ రంగును అలాగే ఉంచుతుంది. అకాల వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది.
జుట్టు కోసం మందార పేస్ట్:
కావాల్సినవి –
కప్పు- మందార ఆకులు
నీరు – తగినంత
1.ముందుగా తాజా మందార ఆకులను తీసుకుని కడగాలి.
2. ఆకులను మెత్తగా రుబ్బుకుని, అవసరమైతే కొద్దిగా నీరు కలిపి, మెత్తని గుజ్జులా చేసుకోవాలి.
3. తర్వాత తలకు అప్లై చేయండి.
4. 30–45 నిమిషాలు అలాగే ఉంచండి.
5. అవసరమైతే షాంపూతో బాగా శుభ్రం చేసుకోండి.
Also Read: ఈ పండ్లు తిన్నారంటే చాలు.. 50 ఏళ్లలో కూడా యవ్వనంగా కనిపిస్తారు
ప్రయోజనాలు:
ఈ పేస్ట్ మీ జుట్టుకు మెరిసే రూపాన్ని ఇస్తుంది. అంతే కాకుండా కుదుళ్లను బలపరుస్తుంది. తలపై చర్మాన్ని కూడా పోషిస్తుంది. క్రమం తప్పకుండా మందార ఆకులను ఉపయోగించడం వల్ల జుట్టు మందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
జుట్టుకు మందార పొడి:
ఆయుర్వేద హెయిర్ ప్యాక్ కోసం మందార ఆకుల పొడిని తాజా మందార ఆకుల స్థానంలో కూడా ఉపయోగించవచ్చు. ఒకవేళ మీకు అవి అందుబాటులో లేకపోతే మందార ఆకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు. దీనిని నూనెలు లేదా హెయిర్ మాస్క్‌లతో సులభంగా కలిపివాడవచ్చు. ఇది తాజా ఆకులు, పువ్వుల మాదిరిగానే పోషకాలను కలిగి ఉంటుంది.