E-Paper
Advertisement

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై లవ్ స్టోరీ బ్యూటీ.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై లవ్ స్టోరీ బ్యూటీ.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
Advertisement

Sri Gouri Priya: బేబీ సినిమాతో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న సాయి రాజేష్( Sai rajesh )కథను అందిస్తూ.. సీనియర్ స్క్రీన్ ప్లే రైటర్ రవి నంబూరి తొలి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం(Kiran abbavaram), శ్రీ గౌరీ ప్రియ జంటగా వచ్చిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోను మించి శ్రీ గౌరీ ప్రియా నటన ప్రేక్షకులను మెప్పించింది. పైగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఇకపోతే తాజాగా చెన్నై లవ్ స్టోరీ సినిమా సక్సెస్ అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించగా.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకుంది గౌరీ ప్రియా. తన సక్సెస్ ను చూడడానికి తన తల్లి లేదు అని చెప్పి అందరిని కంటతడి పెట్టించింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

నా సక్సెస్ చూడడానికి మా అమ్మ ఇక్కడ లేదు – శ్రీ గౌరీ ప్రియ

చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో శ్రీ గౌరీ ప్రియా మాట్లాడుతూ.. “ఒక సినిమా నాకు ఇంత మంచి పేరు తీసుకొస్తుందని అనుకోలేదు. అయితే ఇంతటి మంచి పేరు, సక్సెస్ వస్తున్న సమయంలో ఇదంతా చూడడానికి మా అమ్మ లేదు. ఒకవేళ మా అమ్మ ఈరోజు నా పక్కన ఉండి ఉంటే ఎంతగానో సంతోషించేది. నన్ను ఇలా చూసి ఉంటే ఎంత బాగుండేదో అని చుట్టుపక్కల అందరూ అంటున్నారు. కానీ నాకు తెలుసు మా అమ్మ ఎప్పటికీ పైనుంచి నన్ను చూస్తూ.. ఆశీర్వదిస్తూనే ఉంటుంది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

ALSO READ:అఖిల్ ఏ దేశ పౌరుడో తెలుసా.. త్వరలోనే?

అమ్మ లేకపోతేనేం అమ్మ రూపంలో వారు ఉన్నారుగా..

ఇదే ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. “మా అమ్మ ఇక్కడ లేకపోతేనేమ్ మా అమ్మ రూపంలో విశాల గారు గానీ, ప్రమోదిని గారు కానీ అప్పుడప్పుడు వచ్చి మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇక మీరందరూ నా సక్సెస్ చూసి ఇప్పుడు మీ అమ్మ చూసి ఉంటే బాగుండేది అంటున్నారు. కానీ మా అమ్మ వల్లే నేను ఇదంతా సాధిస్తున్నాను అని అనిపిస్తోంది. ఈ సక్సెస్ నాకు మా అమ్మ నాన్న వల్లే లభిస్తోంది. మా నాన్న కూడా ఈవెంట్ కి వచ్చారు. పైనుంచి మా అమ్మ నన్ను ఆశీర్వదిస్తోంది. మా అమ్మ నాన్నల సపోర్టే నాకు ఇంత మంచి విజయం లభించింది” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రీ గౌరీ ప్రియ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అమ్మ ఎప్పుడూ మీతోనే ఉంటుంది.. దిగులు పడకండి అంటూ అభిమానులు ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు.

శ్రీ గౌరీ ప్రియ సినిమా కెరియర్..

Advertisement

యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. అంతకుముందే బోల్ బేబీ బోల్ ప్రోగ్రాం లో రెండవ సీజన్లో రెండవ స్థానంలో నిలిచి, మూడవ సీజన్లో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత సాక్షి ఎరినా యూత్ సింగింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి, ఆ తర్వాత జెమినీ టీవీలో కొంతకాలం యాంకర్ గా పనిచేసి.. నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. 2018 లో మిస్ హైదరాబాదు టైటిల్ అందుకున్న తర్వాత .. 2021లో తొలిసారి మెయిల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇక రైటర్ పద్మభూషణ్ , ట్రూ లవర్, మ్యాడ్ వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ తో మంచి సక్సెస్ను సొంతం చేసుకున్నారు.

Related News

ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారంటూ సంచలన ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్!

సూర్య సినిమా థియేట్రికల్ రైట్స్ లొల్లి.. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు షాక్!

‘ఆ అక్కలంతా ఏమైపోయారు?’.. NEET పేపర్ లీక్‌పై స్పందించిన అనసూయ!

అఖిల్ ఏ దేశ పౌరుడో తెలుసా.. త్వరలోనే?

నీట్ పేపర్ లీక్ వివాదంపై నవదీప్ షాకింగ్ రియాక్షన్?

మా ఆయనకే లేని నొప్పి మీకెందుకురా నాయనా?.. సాలిడ్ పంచ్ ఇచ్చిన వెటరన్ బ్యూటీ !

అమల అక్కినేని ‘బ్లూ క్రాస్’ ఆరంభం వెనుక నిజాలు బయటపెట్టిన అఖిల్!

Big Stories

Advertisement
×