BigTV English

DMart: డిమార్ట్‌ లో శ్రమించే ఆ సిబ్బంది జీతాలు ఎంతో తెలుసా? నిజంగా షాకవుతారు!

DMart: డిమార్ట్‌ లో శ్రమించే ఆ సిబ్బంది జీతాలు ఎంతో తెలుసా? నిజంగా షాకవుతారు!

DMart Employees Salaries: దేశంలో ప్రముఖ రిటైల్ టైన్ అయిన డిమార్ట్ లో అత్యంత తక్కువ ధరకు నిత్యావసర సరుకులు లభిస్తాయి. దుస్తులు, గృహోపకరణాలు, పర్సనల్ కేర్ ఉత్పత్తులు చీప్ గా దొరుకుతాయి. డిమార్ట్ స్టోర్లలో తక్కువ ధరలకు వస్తువులు లభించడమే కాదు, ఆ స్టోర్లలో పని చేసే సిబ్బందికి కూడా మంచి వేతనాలు ఇస్తుంది యాజమాన్యం. స్టోర్ సిబ్బంది నుంచి కార్పొరేట్ మేనేజర్ల వరకు ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారి జీతాలు ఉద్యోగం, అనుభవం, ప్లేస్ మీద ఆధారపడి ఉంటాయి. డిమార్ట్ లో ఎవరు ఎంత సాలరీ తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ ఎంట్రీ లెవల్ సిబ్బంది(క్యాషియర్స్, స్టాకర్స్, సేల్స్ అసోసియేట్స్): డిమార్ట్ స్టోర్లలో ఎంట్రీ లెవల్ సిబ్బంది నెలవారీ జీతాలు సుమారు రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు ఉంటాయి. వీల్లు డిమార్ట్ స్టోర్లలో కస్టమర్లకు సహాయం చేయడం, ప్రొడక్ట్స్ ను చక్కగా అమర్చడం, క్యాష్ కౌంటర్‌ లో పని చేయడం లాంటి పనులు చేస్తారు. ఓవర్ టైం పే, ప్రావిడెంట్ ఫండ్ (PF), ఆరోగ్య బీమా (ESI) లాంటి అదనపు ప్రయోజనాలు కూడా అందించబడుతాయి.

⦿ సూపర్‌ వైజర్లు, టీమ్ లీడర్లు: డిమార్ట్ లోని సూపర్ వైజర్లు, టీమ్ లీడర్ల నెలవారీ జీతం రూ. 25,000 నుంచి రూ. 40,000 వరకు ఉంటుంది. ఈ ఉద్యోగులు స్టోర్ కార్యకలాపాలను నిర్వహిస్తా. జూనియర్ సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తారు. వారి జీతం అనుభవం, బాధ్యతలపై ఆధారపడి ఉంటుంది.


⦿ స్టోర్ మేనేజర్లు: వీరి జీతం సుమారు  రూ. 50,000 నుంచి రూ. 80,000, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది.  స్టోర్ మేనేజర్లు సిబ్బంది, అమ్మకాలు, లాభాలతో సహా మొత్తం స్టోర్‌ ను పర్యవేక్షిస్తారు. ఎక్కవ బాధ్యతల కారణంగా వారు ఎక్కువ సాలరీ తీసుకుంటారు.

⦿ కార్పొరేట్ రోల్స్(మెయింటెనెన్స్, HR, ఫైనాన్స్, సప్లై చైన్): వీరి జీతాలు ఏడాదికి సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 20 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. వీళ్లు డిమార్ట్ హెడ్ ఆఫీస్ లో పని చేస్తారు. ఇక్కడ ప్రణాళిక, ఆర్థిక, లాజిస్టిక్‌ వ్యవహారాలను నిర్వహిస్తారు. జీతాలు వారు నిర్వర్తించే బాధ్యతలు, అనుభవం మీద ఆధారపడి ఉంటాయి.

Read Also:  డి-మార్ట్‌ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?

డిమార్ట్ లో ఎక్కువ సాలరీ ఎవరు తీసుకుంటారు? 

డిమార్ట్ లో ఎక్కువ సాలరీ CEO, CFO, రీజనల్ మేనేజర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ లు ఎక్కువ జీతాలు తీసుకుంటారు. తరచుగా బోనస్‌ లతో సహా సంవత్సరానికి రూ. 1 కోటి  అంతకంటే ఎక్కువ పొందుతారు. స్టోర్ స్థాయిలో స్టోర్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు ఎక్కువగా సాలరీస్ తీసుకుంటారు. నిజానికి ఇతర రిటైల్ కంపెనీలతో పోలిస్తే సాలరీస్ మధ్యస్థంగా ఉంటాయి. కానీ, ఉద్యోగుల పనితీరు ఆధారంగా బోనస్ లు, ప్రోత్సాహకాలు అందిస్తారు. మొత్తం కలిపి పెద్ద మొత్తంలో డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.

Read Also:  డిమార్ట్‌ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్‌ గా కొనేయొచ్చు?

Related News

ఈ వయస్సు దాటిన ప్రతీ భారతీయుడికి రూ. 5 లక్షల ప్రయోజనం అందించే స్కీం ఇదే..

కేవలం రూ. 24కే టాక్స్ ఫైలింగ్…జియో బంపర్ ఆఫర్..సింపుల్ గా ఇలా ఫైల్ చేయండి..

Bank Holidays: కస్టమర్లకు హెచ్చరిక! నాలుగు రోజులు బ్యాంకు సెలవులు

Rapido Fined: యాడ్ పై రచ్చ.. రాపిడోకు రూ.10 లక్షలు ఫైన్

DMart: ‘డి-మార్ట్’ అంటే ఏంటి? దాని పేరు వెనుక ఇంత కథ ఉందా?

Big Stories

×