E-Paper
Advertisement

కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కుట్ర.. బాలినేని డ్రామా బట్టబయలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల!

కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కుట్ర.. బాలినేని డ్రామా బట్టబయలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల!
Advertisement

Balineni Srinivasa: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఫైర్ అయ్యారు. బాలినేని ఒంగోలుకి అమావాస్యకి ఒక సారి వస్తాడని అన్నారు. ఆయన కూటమిలో ఉన్నాడని మేము సైలెంట్ గా ఉంటున్నాం‌మని, నామీద బాలినేని అనుచరుడు మురళి కరపత్రాలు వేశాడని ఫైర్ అయ్యారు. పోలీసుల విచారణలో బాలినేని అనుచరుడు మురళి కరపత్రాలు వేసినట్టు తేలిందని అన్నారు. బాలినేని మీద కరపత్రాలు వేస్తే పుస్తకాలు సరిపోవని అన్నారు. బాలినేని కావాలని పోలీసులను టార్గెట్ చేశాడని అన్నారు.

గత ప్రభుత్వంలో రౌడీయిజం..

మాపై గత ప్రభుత్వంలో 79 కేసులు పెట్టించాడు. వయస్సు పెరిగిందో ప్రెస్టేషనో కొడుక్కు జనసేన పార్టీలో పదవి రాదనో బాలినేని మాట్లాడుతున్నాడని అన్నారు. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది.. లేక పోతే అబ్బా కొడుకుని లోపేసేవాళ్ళం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని కొడుకు పిల్లలకి గంజాయి అలవాటు చేశాడని, గత ప్రభుత్వంలో రౌడీయిజం చేసినట్టు చెయ్యాలంటే కుదరదని అన్నారు ఐదుసార్లు గెలిచామన్నది కాదు.. ఎలా మాట్లాడుతున్నామో తెలియాలని, జనసేన పార్టీని అడ్డంపెట్టుకుని వైసీపీ నాయకులకు బాలినేని పని చేస్తున్నాడని అన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించేందుకు బాలినేని మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?

ఒంగోలులో బార్ షాపులు..

ఒంగోలులోనే ఉండమని బాలినేని కి వెయ్యి సార్లు చెప్పా.. రెండు నెలలకి ఒకసారి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు. బాలినేని ఇష్టం వచ్చినట్టు బురదచల్లిపోతే చూస్తూ ఊరుకోంమని, గత ప్రభుత్వంలో ఒంగోలులో బార్ షాపులు సిండికేట్ చేసి బాలినేని, ఆయన కొడుకు కోట్లు వసూలు చేశారని అన్నారు. బాలినేని చేసిన అక్రమాలపై కానిపాకంలో ఒట్టు వేసేందుకు వస్తా.. బాలినేని వస్తాడా అని సవాల్ విసిరారు. నేను ఏం చేస్తానో తెలుసు కాబట్టే.. ఒంగోలు ప్రజలు 34 వేలు మెజారిటీ ఇచ్చారని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా బాలినేని కి ఆ మెజారిటీ రాదు. బాలినేని కి ఐదు సార్లు ఓట్లు ఎలా వేశారో అర్థం కావడం లేదు. బాలినేని వియ్యంకుడు విల్లాల్లో ప్రభుత్వ భూమి ఉంది‌. దాన్ని వెంగముక్కలపాలెం ప్రజలకు కమ్యూనిటీ హాల్ కి ఇస్తాం అని అన్నారు.

Advertisement

Also Read: బాబు హెచ్చరిక.. విజయ్ ఆదేశాలు.. ఇసుక దందాకు చెక్ పడేనా?

Tags

Related News

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

Big Stories

Advertisement
×