Monster Business:‘దిల్ రాజు’ .. ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీకి కేరాఫ్.కానీ కాలం మారింది ,కాలక్రమంలో కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ రావడం వరుస సక్సెస్ లు చూడటం ,అదే సమయంలో దిల్ రాజు సినిమాలు తగ్గించుకోవడం, చేసిన భారీ సినిమాలు బోల్తా కొట్టడంతో ఒకసారిగా లైం లైట్ లో లేకుండా పోయాడు.
అయితే తాజాగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న మాన్‌స్టర్’ సినిమాకు సంబంధించిన ఓ భారీ బిజినెస్ డీల్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో “అసలు దిల్ రాజు మళ్లీ తన పాత ఫామ్‌లోకి వస్తున్నారా?” అనే చర్చ మొదలైంది.
సల్లూ భాయ్ హీరో గా ‘మాన్‌స్టర్’
విషయంలోకి వస్తే దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్లూ భాయ్ హీరో గా ‘మాన్‌స్టర్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార తొలిసారి జోడీ కట్టింది కూడా .ఇక సల్మాన్‌కు ఉన్న మాస్ ఇమేజ్, సౌత్‌లో నయనతార క్రేజ్, వంశీ పైడిపల్లి మేకింగ్, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్.. ఇవన్నీ కలవడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశంలోకి వెళ్ళిపోయాయి.
ఇక ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాలో అరవింద్ స్వామి, రోనిత్ రాయ్, సీమా బిస్వాస్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్‌లో ఓవర్సీస్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని 2027 ఈద్ (Eid)కి రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.
రూ. 100 కోట్ల థియేట్రికల్ డీల్ నిజమేనా?
అయితే తాజాగా ఈ సినిమా కి ఒక భారీ బిజినెస్ డీల్ జరిగిందని తెలుస్తుంది. ‘మాన్‌స్టర్’ ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) ఏకంగా రూ.100 కోట్లకు(రిఫండబుల్ అడ్వాన్స్ పద్ధతిలో) దక్కించుకుందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ ఇప్పటి వరకు ఎక్కడా అఫీషియల్ గా అనౌన్స్ ,మాత్ర్తం చేయలేదు. ఈ వార్త నిజమైతే మాత్రం దిల్ రాజు దశ తిరిగిందనే చెప్పాలి.
ఈద్ సెంటిమెంట్ & పర్ఫెక్ట్ ప్లానింగ్
వంశీ పైడిపల్లి గతంలో మహేష్ బాబుతో ‘మహర్షి’, విజయ్‌తో ‘వారసుడు’ వంటి కమర్షియల్ హిట్స్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇప్పుడు సల్మాన్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో యాక్షన్ డ్రామా చేయడం ఆయన కెరీర్‌కు కూడా పెద్ద ప్లస్ అవుతుంది అనడంలో సందేహం లేదు. పైగా, బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సినిమాలకు ‘ఈద్’ పండుగ అనేది ఒక సెంటిమెంట్ ‘వాంటెడ్’, ‘దబాంగ్’, ‘కిక్’ లాంటి హిట్స్ ఆ టైమ్‌లోనే వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అందుకే 2027 ఈద్ రిలీజ్‌ను దిల్ రాజుటార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంత బాగున్నా, చివరికి బాక్సాఫీస్ దగ్గర నెగ్గాల్సింది కంటెంటే .మరి ‘మాన్‌స్టర్’ మూవీతో నార్త్ మార్కెట్‌లో దిల్ రాజు బ్రాండ్ మళ్లీ గట్టిగా రీ-సౌండ్ చేస్తుందా లేక ఎప్పటిలాగే సైలెంట్ గా సైడ్ అవుతాడా అన్నది కాలమే డిసైడ్ చేయాలి !
also read :కింగ్ ఖాన్ కి భారీ షాక్.. రూ.2490 కోట్లు గోవిందా!