iBOMMA Ravi:ఐబొమ్మ..ఈ పేరు టాలీవుడ్ ని ఎంతలా వణికించిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇలా సినిమా రిలీజ్ అయితే చాలు అలా hd ప్రింట్ తో ఈ వెబ్ సైట్ లో ప్రత్యక్షమయ్యేది.ఇక వెబ్ సైట్ వల్లే మా సినిమాలకి కలెక్షన్స్ రాలేదు మొర్రో అని బాధ పడ్డ నిర్మాతలు బోలెడు. ఇక ఈ వెబ్ సైట్ నిర్వాకుడు రవి ఎట్టకేలకి కటకటాలలోకి వెళ్ళడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఐబొమ్మ వ్యవహారంలో ఇమ్మడి రవికి సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. రవి బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఖాతాల్లో ఇప్పటికే ఫ్రీజ్ చేసి ఉన్న దాదాపు రూ.3 కోట్ల మొత్తాన్ని మాత్రం తీసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒకవైపు ఊరట దక్కినట్టే కనిపించినా.. అసలు పెద్ద మొత్తంపై మాత్రం బ్రేక్ పడినట్టైందన్న మాట.
ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే . ఐబొమ్మ పైరసీ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇమ్మడి రవికి సంబంధించిన కొన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అందులో దాదాపు రూ.3 కోట్ల డబ్బు ఉందని దర్యాప్తు సమయంలో తెల్సింది.అయితే ఈ డబ్బుని వాడుకుందామంటే ఈ ఖాతాలు స్తంభించిపోవడంతో తనకు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని కోర్టు మెట్లు ఎక్కాడు.
తన కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని, రోజు వారి ఖర్చులకి కూడా ఉన్న డబ్బు వాడుకొని పరిస్థితి ఏర్పడిందని తన పిటిషన్‌లో చెప్పుకొచ్చాడు. ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని అన్‌ఫ్రీజ్ చేసి తను వాడుకునేలా వెసులు బాటు కలిపించాలని వేడుకున్నాడు.
ఇక ఈ పిటిషన్‌పై తాజాగా నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. రవి వాదనలు విన్న కోర్టు ఆ ఖాతాలని ఫ్యూచర్ లో వాడుకోవచ్చని ఊరట నిచ్చింది,కాని అందులో ఫ్రీజ్ అయిన డబ్బుని మాత్రం వాడుకునేందుకు అనుమతిని ఇవ్వలేదు.అంటే ఆ మూడు కోట్లని రవి ఇక ముట్టుకోవడానికి ఆస్కారం లేదన్న మాట. ఆ డబ్బు కావాలి మొర్రో అంటే ఖాతాని వాడుకోవచ్చు కానీ డబ్బుని మాత్రం ముట్టడానికి వీలు లేదు అంటూ రవికి పెద్ద షాకే ఇచ్చింది.
ఐబొమ్మ రవి విషయానికి వస్తే సినిమాలని దొంగతనంగా రికార్డ్ చేసి ఫుల్ hd క్వాలిటీ లో ఐ బొమ్మ అనే వెబ్ సైట్ లో పెడుతున్నాడని పైరసీ చట్టం కింద 2025 నవంబర్‌లో ఇమ్మడి రవిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఎన్నో వాదనల తర్వాత 2026 ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టు ఆయనకు కొన్ని కఠినమైన షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
also read :రూ.100 కోట్ల డీల్.. దిల్ రాజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడా?
చూడాలి మరి తాజాగా కోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ పై రవి ఎలా రియాక్ట్ అవుతాడో !